Begin typing your search above and press return to search.

జంట బావున్నా సినిమా సోసోనే అన్నారుగా

By:  Tupaki Desk   |   4 Oct 2020 3:00 PM IST
జంట బావున్నా సినిమా సోసోనే అన్నారుగా
X
ఇషాన్ ఖట్టర్ - అనన్య పాండే జంట‌గా న‌టించిన‌ చిత్రం `ఖాలీ పీలీ`. గాంధీ జయంతి రోజున ప్రివ్యూని ప్రదర్శించింది చిత్ర‌బృందం. ఇంత‌కీ మూవీ ఎలా ఉంది? న‌ట‌వార‌సుల న‌ట‌న ఎలా ఉంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఇప్ప‌టికే స‌మాధానం దొరికేసింది. సోషల్ మీడియాలో ఇషాన్ ఖత్త‌ర్ సోదరుడు స్టార్ హీరో షాహిద్ కపూర్ .. అతని భార్య మీరా రాజ్ ‌పుత్ ఆన్‌స్క్రీన్ జోడీపై ప్ర‌శంస‌లు కురిపించారు.

ఆల్ ది బెస్ట్ ఇషాన్ ఖట్టర్ - అనన్య పాండే అంటూ ఉత్సాహ ప‌ర‌చ‌డం విశేషం. మీరా రాజ్‌పుత్ మ‌రిది కోసం చీర్ లీడ‌ర్ గా మారి ఉత్సాహం నింప‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. ఖాలీ పీలీ శుక్రవారం ఓటీటీలో రిలీజైంది. మూవీ మిశ్రమ సమీక్షలు అందుకుంది. ఈ చిత్రం ఒక‌ కామిక్ కేపర్ .. ఇది మంచి పాయింట్ తోనే తె‌ర‌కెక్కినా ల్యాగ్ సీన్స్ బోర్ కొట్టించాయ‌న్న టాక్ వ‌చ్చింది. డబ్బు ఆభరణాలతో నిండిన బ్యాగ్ ‌తో పారిపోతున్నప్పుడు ఇషాన్ పాత్ర బ్లాకీ.. క్యాబ్ లో వెళుతున్న ఒక నర్తకి (అనన్య)కి క‌నెక్ట‌యిపోతాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అన్న‌దే సినిమా. పూజా .. బ్లాకీ చిన్ననాటి స్నేహితులు అన్న పాయింట్ ఇంట్రెస్టింగ్.

మక్బూల్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాయ‌కానాయిక‌ల న‌ట‌న బావుంద‌న్న టాక్ వ‌చ్చింది. ఖాలీ పీలీ అనన్యకు మూడవ బాలీవుడ్ చిత్రం కాగా.. ఇషాన్ కి రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్. ప్ర‌స్తుతం ఈ జంట కెరీర్ ప‌రంగా ఎవ‌రికి వారు ఫుల్ బిజీగా ఉన్నారు. ఖాలీ పీలీ ప్ర‌చారంలో ఇదిగో ఇలా ఫోజిచ్చి ఆక‌ట్టుకుంది ముచ్చ‌టైన యువ జంట‌.