Begin typing your search above and press return to search.

సమంతా చైతుకు లక్కీ ఛార్మ్ అనిపించుకుందే!

By:  Tupaki Desk   |   7 April 2019 10:38 AM GMT
సమంతా చైతుకు లక్కీ ఛార్మ్ అనిపించుకుందే!
X
సినిమా అవుట్ పుట్ చూసి సరైన జడ్జిమెంట్ చెప్పగలిగే అతి తక్కువమంది సెలబ్రిటీలలో అక్కినేని నాగార్జున ఒకరని అంటూ ఉంటారు. అదేంటో కానీ గత కొంత కాలంగా ఆయన జడ్జిమెంట్ సరిగా వర్క్ అవుట్ కావడం లేదు. నాగచైతన్యకు ఒక సూపర్ హిట్ ఇవ్వాలని.. నెక్స్ట్ లీగ్ లోకి తీసుకెళ్ళాలని ఎంత ప్లాన్ చేసినా అది కుదరలేదు. ఇక అఖిల్ సినిమాల సంగతి కూడా తెలిసిందే. ఇద్దరు తనయుల సినిమాలతో పాటుగా తన సొంత సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. వర్మతో ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా.. ఎంత మొహమాటం అయినా 'ఆఫీసర్' కు ఒప్పుకోవడం నాగ్ అభిమానులకు అసలేమాత్రం నచ్చలేదు.

ఇలా అక్కినేని హీరోలు అందరూ ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో నాగ చైతన్య - సమంతాలు జంటగా నటించిన 'మజిలీ' సక్సెస్ కావడం అక్కినేని అభిమానులను ఎంతో సంతోషపెట్టింది. నాగార్జున అయితే 'మజిలీ' సక్సెస్ పట్ల ఫుల్ ఖుషీ అయ్యారని సమాచారం. ఈ సినిమా విషయంలో నాగార్జున ఇన్వాల్వ్ మెంట్ అసలేమీ లేదని.. 'అంతా సమంతానే చేసిందని' టాక్ వినిపిస్తోంది. షూటింగ్ సమయంల సమంతా ఈ సినిమాలో ఓవర్ గా ఇన్వాల్వ్ అవుతోందని కూడా గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత చైతుకు ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని.. తన కెరీర్లో ఇదో మెమొరబుల్ ఫిలింలా నిలిచిపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో సమంతా జడ్జిమెంట్ చైతుకు చక్కగా వర్క్ అవుట్ అయిందనేది తెలిసిపోయింది.

'మజిలీ' కంటే ముందుగా మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే ప్లాన్ లో చైతూ ఉన్నప్పటికీ.. ఈ సినిమా చైతుకు సెట్ అవుతుందనే ఉద్దేశంతో 'మజిలీ' కోసం ఒప్పించిందని టాక్ కూడా ఉంది. ఈ లెక్కన చైతు కెరీర్ పట్ల నాగార్జునకు ఉన్న టెన్షన్ ను పూర్తిగా తగ్గించినట్టే. ఈ సక్సెస్ తో అక్కినేని కుటుంబం పెద్ద పార్టీ చేసుకుందట.