Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ఓపెన్‌ చేయకుండా ఉండలేక పోయా

By:  Tupaki Desk   |   20 Dec 2020 11:12 AM GMT
ఫొటోటాక్‌ : ఓపెన్‌ చేయకుండా ఉండలేక పోయా
X
మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టిన రోజుకు మరి కొన్ని గంటల సమయం ఉంది. డిసెంబర్‌ 21న అంటే రేపు తమన్నా తన 31వ పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈ అమ్మడి పుట్టిన రోజు వేడుకలు అప్పుడే ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల నుండే స్నేహితుల హడావుడి కనిపిస్తుంది. ఈ అమ్మడు గత రాత్రి స్నేహితులు ఇచ్చిన పుట్టిన రోజు పార్టీలో పాల్గొంది. ఆ సందర్బంగా ఒక స్నేహితురాలు ఇచ్చిన గిఫ్ట్‌ ను పుట్టిన రోజున అంటే రేపు ఓపెన్‌ చేయాలనుకుందట. కాని అందులో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఓపెన్‌ చేసింది. అందులో ఉన్న వింటర్‌ జాకెట్‌ ను ధరించి మరీ ఫొటోలు షేర్‌ చేసింది.

ఈ ఫొటోతో పాటు తమన్నా ఇన్‌ స్టాలో.. బర్త్‌ డే గిఫ్ట్‌ ను ఓపెన్‌ చేయకుండా ఉండలేక పోయాను. థ్యాంక్యూ ప్రీతి ఈ జాకెట్‌ నాకు బాగా నచ్చింది అంటూ కామెంట్ పెట్టింది. స్నేహితురాలు ఇచ్చిన జాకెట్ ను వెంటనే ధరించడంతో పాటు ఫొటోలు దిగింది. స్నేహితురాలితో కూడా ఫొటోలు దిగి తన బర్త్‌ డే ముందస్తు వేడుకను సోషల్‌ మీడియా లో కూడా షేర్‌ చేసింది. ఈ అమ్మడు పుట్టిన రోజు సందర్బంగా ఆమె నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ లు నేడు కాని రేపు కాని విడుదల అయ్యే అవకాశం ఉంది. రేపు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చగా ఉండే అవకాశం ఉందంటున్నారు.