Begin typing your search above and press return to search.

సమంతను ఎవరైనా ప్రేమించాల్సిందే

By:  Tupaki Desk   |   21 March 2018 7:43 AM GMT
సమంతను ఎవరైనా ప్రేమించాల్సిందే
X
టాలీవుడ్ బ్యూటీ సమంత అంటే అభిమానులకు ప్రాణం. మొదటి సినిమాతోనే మాయ చేసేసిన ఈ బ్యూటీ.. ఇప్పటివరకూ అదే తీరు జోరు కంటిన్యూ చేస్తోంది. సుదీర్ఘ కాలం టాప్ ఛైర్ లో కూర్చుని తన సత్తా చాటుతోంది. సామ్ ను అభిమానులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ జనాలు కూడా తెగ పొగిడేస్తున్నారంటే.. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి.

రీసెంట్ గా కాస్ట్యూమ్ డిజైనర్ ఇంద్రాక్షి.. సమంత గురించి చెబుతూ పెట్టిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 'తను ఓ సూపర్ ఉమన్. పంక్చువాలిటీ.. హార్డ్ వర్క్.. డెడికేషన్.. మనకంటూ ప్రత్యేకమైన శైలి ఏర్పాటు చేసుకోవడం.. నిజంగా స్ఫూర్తి నింపేలా నడచుకోవడం ఎన్నో అంశాలను నేర్పించింది. అందుకే నిన్న నేను ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటాను సమంతా' అంటూ ట్వీట్ చేసింది' ఇంద్రాక్షి. మహానటి మూవీకి వీరిద్దరూ కలిసి వర్క్ చేయగా.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. రీసెంట్ గా రంగస్థలం మూవీ యూనిట్ కూడా ఇదే స్థాయిలో ప్రశంసలు గుప్పించింది.

దర్శకుడు సుకుమార్.. హీరో రామ్ చరణ్.. సమంత బిహేవియర్ ను తెగ పొగిడేశారు. సామ్ పని చేసిన ప్రతీ సినిమా నుంచి టీంలోని ప్రతి ఒక్కరూ ఆమె ప్రవర్తనను ప్రశంసిస్తున్నారంటే.. ఎంతటి అద్భుతమైన వ్యక్తిత్వమో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఓ సందర్భంలో షాట్ గ్యాప్ వస్తే.. కార్వాన్ లో కాకుండా మేకప్ మెన్.. అసిస్టెంట్స్ తో కలిసి సమంత కబుర్లు చెబుతున్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.