Begin typing your search above and press return to search.

వీడియో : కరోనా వైరస్‌ 2 ను వదిలిన వర్మ

By:  Tupaki Desk   |   2 Dec 2020 2:05 PM IST
వీడియో : కరోనా వైరస్‌ 2 ను వదిలిన వర్మ
X
రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'కరోనా వైరస్‌' సినిమా ఈనెల 11న విడుదల కాబోతుంది. ఒక ఫ్యామిలీ కరోనాకు ముందు ఎంత సంతోషంగా ఉంది.. కరోనా సమయంలో ఎంత ప్యానిక్‌ అయ్యింది అనేది వర్మ చూపించాలనుకుంటున్నాడు. సింపుల్‌ కథ మరియు సింపుల్‌ గా రూపొందించిన ఈ సినిమా విడుదలకు ఎన్నో నెలల క్రితం మొదలు అయ్యింది. సినిమాను ఓటీటీ లేదా ఏటీటీలో విడుదల చేయాలని వర్మ అనుకోకుండా థియేటర్ల రిలీజ్‌ కు వెయిట్‌ చేశాడు. థియేటర్లు ప్రారంభం తర్వాత విడుదల అవుతున్న మొదటి సినిమా ఇదే. ఇప్పటికే కరోనా వైరస్‌ ట్రైలర్‌ ను వర్మ విడుదల చేసి సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చాడు.

సినిమా విడుదలకు తేదీ ప్రకటించిన నేపథ్యంలో మరో ట్రైలర్‌ ను వర్మ విడుదల చేశాడు. ఇంట్లో ఒక్కరికి కరోనా రావడం.. ఇంట్లో ఉన్న ఇతరులు ఆందోళన చెందడం వంటివి సినిమాలో చూపించాడు. కరోనా భయం మొదట్లో ఏ స్థాయిలో ఉందో ఈ సినిమాను చూస్తే అర్థం అవుతుంది. కరోనా వైరస్‌ సినిమాతో వర్మ థియేటర్లను పునః ప్రారంభించేందుకు సిద్దం అయ్యాడు. వర్మ ఈ ట్రైలర్‌ తో సినిమాపై అంచనాలు పెంచడంలో సఫలం అయ్యాడు.

రెండు ట్రైలర్‌ లు విడుదల అయిన తర్వాత సినిమా పై మరింతగా ఆసక్తిగా పెరిగింది. 9 నెలలుగా థియేటర్లకు దూరంగా ఉంటున్న ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల ముందు క్యూ కడతారా అనేది చూడాలి. వర్మ కరోనా వైరస్‌ మాత్రమే కాకుండా ఆ తర్వాత వరుసగా రెండు సినిమాలను వారం గ్యాప్‌ లోనే విడుదల చేయబోతున్నాడు. మర్డర్‌ మరియు దిశా ఎన్‌ కౌంటర్‌ సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. వర్మ సినిమాలకు జనాలు వస్తే ఇతర సినిమాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.