Begin typing your search above and press return to search.
కరోనా దెబ్బకు ఐఫా అవార్డ్స్ వాయిదా
By: Tupaki Desk | 7 March 2020 9:33 AM ISTకరోనా.. కరోనా.. కరోనా .. ప్రస్తుతం యావత్ ప్రపంచం కరోనా నామ జపం చేస్తోంది. ఈ పేరు వింటేనే హడలిపోతున్నారు. భారత దేశంలోనూ అక్కడక్కడా కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వాలు ఆందోళనతో ముందస్తుగా అప్రమత్తమవుతున్నాయి. దీని ప్రభావం అన్ని పరిశ్రమలపైనా పడటంతో ఉద్యోగులు ఆఫీస్ కి రాకుండా ఇంటి వద్ద నుంచే వర్క్ చేసుకోవాలనే ఆదేశాలు అందుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఐటీ పరిశ్రమలు ఆలోచనలో పడ్డాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఐటీకే కాదు ఈ ముప్పు సినీపరిశ్రమకు పొంచి ఉండడం బెంబేలెత్తిస్తోంది.
సినీ పరిశ్రమ కరోనా దెబ్బతో జరిగే నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపడుతోంది. మా అసోసియేషన్... నిర్మాతల మండలి సహా ఫెడరేషన్ జాగ్రత్త పడుతున్నాయి. థియేటర్లకు వెళ్లే వారికి కరోనా పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు అందాయి. షూటింగ్‌లు కూడా బంద్ అవుతాయని వార్తలు వచ్చినా ..అలాంటిదేమీ లేదని భయాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి సభలుజ.. సమావేశాలు.. కార్యక్రమాలు పెట్టుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ప్రభావం అంతవరకేనా? అంటే.. ఇప్పుడు అవార్డు వేడుకల పైనా దీని ప్రభావం పడుతోంది. తొలిగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ (ఐఫా)-2020 పైన పడింది. తొలుత ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మధ్య ప్రదేశ్ లో నిర్వహించాలని తల పెట్టారు. అయితే కరోనా దెబ్బకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దీని కోసం కార్యక్రమ నిర్వాహకులు మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్ని.. సినీ పెద్దలను సంప్రదించారట. వారు కరోనాను దృష్టిలో పెట్టుకుని వెంటనే అంగీకరించలేదట. అయితే కొత్త ఐఫా వేదిక ను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఇది తెలిసిన నెటిజనులు అవార్డు కార్యక్రమాల్ని కూడా కరోనా వేధిస్తోందా? అంటూ సోషల్ మీడియాలో పంచ్ లు వేస్తున్నారు. నిశ్చలంగా ఉన్న తటాకంలో పడిన రాయిలాగా కరోనా తటాకం అంతటా విస్తరిస్తోంది. అన్ని రంగాల్ని కుదేలయ్యేలా చేస్తోంది.