Begin typing your search above and press return to search.

#క‌రోనా: ఛాన్స్ దొరికింది క‌దా అని RFC రేట్లు పెంచేస్తారా?

By:  Tupaki Desk   |   13 April 2020 9:30 AM IST
#క‌రోనా: ఛాన్స్ దొరికింది క‌దా అని RFC రేట్లు పెంచేస్తారా?
X
క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో ప్ర‌పంచం లాక్ డౌన్ అయిన సంగ‌తి తెలిసిందే. 210 దేశాల్లో క‌రోనా విల‌య‌తాండ‌వ‌మాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అంత‌కంత‌కు కొవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌డం ఆందోళ‌న పెంచుతోంది. ఇక క‌రోనా వినోద ప‌రిశ్ర‌మ‌పై ఓ రేంజులో విరుచుకుప‌డింది. ఎక్క‌డ షూటింగులు అక్క‌డ బంద్ అయిపోవ‌డంతో ఏదీ పాలుపోని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక ప్ర‌పంచం లాక్ డౌన్ నేప‌థ్యంలో విదేశీ లొకేష‌న్ల‌లో చేయాల్సిన‌ షూటింగులు నిలిచిపోయాయి. ఈ స‌న్నివేశం ఇంకా ఎన్నాళ్లు కొన‌సాగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాలు తెరుచుకునేందుకు ఇప్ప‌ట్లో ఆస్కార‌మే క‌నిపించ‌డం లేదు. స్థానికంగా ష‌ర‌తుల‌తో కూడుకున్న స‌డ‌లింపు క‌నిపిస్తున్నా.. విదేశాల‌కు వెళ్లేంత వెసులుబాటు లేనే లేదు.

దీంతో ఫారిన్ లో చిత్రీక‌రించాల్సిన షెడ్యూల్స్ అన్నిటినీ ఆర్.ఎఫ్.సి లేదా స్థానిక లొకేష‌న్ల‌లో పూర్తి చేసేందుకు ప‌లువురు బ‌డా నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఇందులో ఆర్.ఆర్.ఆర్ స‌హా ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ సినిమా.. ప్ర‌భాస్ - జాన్ .. త‌దిత‌ర‌ చిత్రాలు ఉన్నాయి. ప‌వన్ క‌ల్యాణ్ హిస్టారిక‌ల్ మూవీ తాజా షెడ్యూల్ ని మొరాకోలో చిత్రీక‌రించాల‌ని క్రిష్ తొలుత భావించారు. కానీ ఇప్పుడు ఐడియా మారింది. రామోజీ ఫిలింసిటీలో తెర‌కెక్కించి మొరాకో లుక్ కోసం వీఎఫ్ ఎక్స్ ని ఆశ్ర‌యించ‌నున్నార‌ట‌. అలాగే యూర‌ప్ లో తెర‌కెక్కాల్సిన ప్ర‌భాస్ జాన్ షెడ్యూల్ ని ఆర్.ఎఫ్.సి లొకేష‌న్ల‌కే షిప్ట్ చేయ‌నున్నార‌ని చెబుతున్నారు. అలాగే ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన పూణే షెడ్యూల్ ని ఆర్.ఎఫ్.సిలో పూర్తి చేసేందుకు సెట్స్ వేయాల‌ని నిర్ణ‌యించార‌ట‌. బాహుబ‌లి స‌మ‌యంలో రామోజీపై అలిగాడ‌ని జ‌క్క‌న్న పై ప్ర‌చార‌మైంది. అయితే ఆ అల‌క వ‌దిలేసి ఇప్పుడు ఆర్.ఎఫ్‌.సీ నే ఆయ‌న కోరుకుంటున్నారా? అన్న‌ది ఇంట్రెస్టింగ్. దేశంలో పూణే- గోవా స‌హా మ‌హారాష్ట్ర మొత్తం క‌రోనా విధ్వంశం కొన‌సాగుతున్న వేళ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక్క‌డే తెర‌కెక్కించి విదేశాల్లో షెడ్యూల్ చేసిన‌ట్టుగా వీఎఫ్‌.ఎక్స్ సాయం తీసుకోనున్నార‌న్న‌మాట‌. ఆ మేర‌కు అవ‌స‌రం మేర సెట్స్ డిజైన్ చేసే ప‌నిలో క‌ళాద‌ర్శ‌‌‌కులు బిజీ.

మ‌రోవైపు టాలీవుడ్ నిర్మాత‌ల‌కు క‌రోనా పాఠాలు ఫుల్లుగా ఎక్కేస్తుండ‌డంతో బ‌డ్జెట్లు కోసేసి ప‌రిమిత బ‌డ్జెట్ లో పెండింగ్ సినిమాని ఎలా పూర్తి చేయాలా? అని భావిస్తున్నార‌ట‌. అయితే ప్ర‌స్తుత స‌న్నివేశంలో రామోజీ ఫిలింసిటీనే సేఫ్ అనుకుని ఇటు తెలుగు సినిమాలు స‌హా అటు బాలీవుడ్ సినిమాలు ఇరుగు పొరుగు భాష‌ల సినిమాల‌న్నీ అక్క‌డే తిష్ఠ వేసుకుని కూచుంటే ఆ మేర‌కు రామోజీ లొకేష‌న్ ఛార్జీలు పెంచి వ‌సూలు చేయ‌రు క‌దా? అంటూ సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి క‌రోనా అంద‌రికీ న‌ష్టం చేకూర్చినా.. రామోజీకి.. ఆర్.ఎఫ్‌.సీ కి ఇలా మేలు చేసిందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక రామోజీకే చెందిన ప‌లు వ్యాపారాలు క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల దెబ్బ తిన్న సంగ‌తి తెలిసిందే.