Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్స్ తండ్రికి కరోనా.. ఆసుపత్రిలో చేరిక!

By:  Tupaki Desk   |   29 April 2021 8:00 PM IST
స్టార్ హీరోయిన్స్ తండ్రికి కరోనా.. ఆసుపత్రిలో చేరిక!
X
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో కరోనా బారిన పడుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలో కోవిడ్ కారణంగా సెలబ్రిటీలను కోల్పోతున్నాం. కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం దేశం మొత్తాన్ని వణికిస్తుంది. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సీనియర్ నటుడు.. స్టార్ హీరోయిన్స్ కరిష్మా - కరీనా తండ్రి రణధీర్ కపూర్ ఇటీవలే కోవిడ్ పాజిటివ్ కారణంగా ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో అడ్మిన్ చేశారు. 74 ఏళ్ల వయసు పైబడిన రణధీర్ కపూర్ ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఆరోగ్యం విషయంలో ఫ్యామిలీ ఎప్పటికప్పుడు అభిమానులకు సమాచారం అందిస్తూనే ఉన్నారు.

అసలు విషయం ఏంటంటే.. గతేడాది ఏప్రిల్ 30న రణధీర్ కపూర్ తన తమ్ముడు, నటుడు రిషి కపూర్‌ను కోల్పోయాడు. అలాగే అదే ఏడాది సోదరి రితు నందా కూడా తుదిశ్వాస విడిచింది. మరో విషాదం.. 2021 ఫిబ్రవరి 9న రణధీర్ మరో తమ్ముడు రాజీవ్ కపూర్‌ను కూడా కోల్పోయాడు. ఆ విషయాన్నీ కూడా ఆయనే స్వయంగా బయటికి తెలియజేప్పారు. ఇదిలా ఉండగా.. రణధీర్ కపూర్ కూడా 2018 నుండి క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఇప్పుడు కరోనా అనేసరికి ఫ్యాన్స్ ఫ్యామిలీ సన్నిహితులు కంగారు పడుతున్నారు. అసలే గతేడాది కాలంగా ఆయన తోడబుట్టిన వారిని కోల్పోతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని సోషల్ మీడియాలో ప్రే చేస్తున్నారు. 1971లో కల్ ఆజ్ ఔర్ కల్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన రణధీర్ కపూర్.. చివరిగా 2012 హౌస్ ఫుల్-2 మూవీలో కనిపించారు.