Begin typing your search above and press return to search.
వకీల్ సాబ్ టీమ్ అందరికీ కరోనా టెస్టులు కారణమిదే!
By: Tupaki Desk | 4 April 2021 3:00 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నేటి సాయంత్రం ప్రీరిలీజ్ వేడుకకు చిత్రబృందం సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం మేరకు.. ఈవెంట్ కి వెళ్లే ముందే చిత్రబృందంలోని కీలక సభ్యులంతా కరోనా వైరస్ టెస్టులు చేయించుకున్నారని తెలిసింది.
వకీల్ సాబ్ లో నటించిన నివేదా థామస్ కి పాజిటివ్ అని రావడంతో ఇప్పుడు చిత్రబృందం అలెర్ట్ అయ్యింది. దీంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ముందు మేకర్స్ టోటల్ టీమ్ ని అప్రమత్తం చేశారు. ఈ బృందం కరోనా వైరస్ పరీక్షలను చేయించుకున్నారు. అయితే ప్రతి ఒక్కరికీ నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చిందట.
హైదరాబాద్ శిల్ప కళావేదికలో నేటి (మార్చి 4) సాయంత్రం ప్రణాళిక ప్రకారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ సహా టీమ్ అంతా విచ్చేస్తోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా బోనీకపూర్ - దిల్ రాజు నిర్మించారు. నేటి ఈవెంట్లో బాలీవుడ్ ప్రముఖుడు అని ప్రచారమైంది. ఆయన ఎవరు? అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది.