Begin typing your search above and press return to search.

స్టార్ హీరోకు కరోనా టెస్ట్.. ఏం తేలిందంటే?

By:  Tupaki Desk   |   30 March 2020 6:00 PM IST
స్టార్ హీరోకు కరోనా టెస్ట్.. ఏం తేలిందంటే?
X
మనకు మహేష్ బాబు ఎంత ఫేమసో.. తమిళనాట హీరో విజయ్ కూడా అంతే ఫేమస్. ఈయనంటే పడిచచ్చే అభిమానులు బోలెడంత మంది. అలాంటి హీరో ఇంట్లో కరోనా తనిఖీలు గుబులు రేపాయి.

తమిళ ఇళయ తళపతి.. స్టార్ హీరో విజయ్ ఇంట్లో సోమవారం ఆకస్మాత్తుగా ఆరోగ్య శాఖ అధికారులు కరోనా తనిఖీలు చేయడం తమిళనాట కలకలం రేపింది. విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ఇళ్లను ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి వ్యాధి బారిన పడ్డ వారిని గుర్తిస్తున్నారు. ఇందుకోసం విదేశాలకు వెళ్లొచ్చిన వారి ఇళ్లను అధికారులు సందర్శిస్తున్నారు.

స్టార్ హీరో విజయ్ కూడా సినిమా షూటింగ్ ల పేర విదేశాలకు వెళ్లడం తో చెన్నైలోని ఆయన నివాసాన్ని అధికారులు తనిఖీ చేశారు. వైద్యుల బృదం విజయ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేశారు. వారు ఎవరికీ కరోనా సోకలేదని నిర్ధారణ కావడం తో అభిమానులంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం శానిటైజర్స్ స్ప్రే చేసి వచ్చారు. ఈ వార్త తమిళనాట వైరల్ గా మారింది.