Begin typing your search above and press return to search.

హీరోయిన్ దీపికా కుటుంబంలో క‌రోనా క‌ల్లోలం!

By:  Tupaki Desk   |   4 May 2021 9:00 PM IST
హీరోయిన్ దీపికా కుటుంబంలో క‌రోనా క‌ల్లోలం!
X
ర‌ముఖ బ్యాడ్మింటన్ ప్లేయ‌ర్ ప్ర‌కాష్ ప‌దుకొణె కొవిడ్ బారిన ప‌డ్డారు. బెంగ‌ళూరులోని ఓ ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు.. భార్య ఉజ్వ‌ల‌, కూతురు అనిషా కూడా కొవిడ్ బారిన ప‌డ్డారు. దీంతో.. వీరిద్ద‌రూ హోం ఐసోలేష‌న్లో ఉన్నారు.

ప్ర‌కాష్ ప‌దుకొణె కూడా హోం ఐసోలేష‌న్లోనే ఉన్న‌ప్ప‌టికీ.. జ్వ‌రం త‌గ్గ‌క‌పోవ‌డంతో గ‌త శ‌నివారం ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. ఆయ‌న ఆరోగ్యం బాగుంద‌ని మ‌రో రెండు రోజుల్లో ప్ర‌కాష్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని అకాడ‌మీ డైరెక్ట‌ర్ విమ‌ల్ తెలిపారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొణె.. ప్ర‌కాష్ కూతురు అన్న సంగ‌తి తెలిసిందే. మొత్తం కుటుంబంలోని ముగ్గురు కొవిడ్ బారిన ప‌డ‌గా.. దీపికా పాడుకొనే కి కూడా పాజిటివ్ వచ్చినట్టు లేటెస్ట్ న్యూస్ రిపోర్ట్స్ లో తెలుస్తుంది