Begin typing your search above and press return to search.

కరోనా ఫ్రీ.. ఐయాం బ్యాక్ : కృతి సనన్

By:  Tupaki Desk   |   1 Jan 2021 5:14 AM GMT
కరోనా ఫ్రీ.. ఐయాం బ్యాక్ : కృతి సనన్
X
‘నేను అనుకున్నదానికంటే చాలా బలంగా ఉన్నాను. కరోనా సోకిన తర్వాత ఆ విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నా బలాన్ని తిరిగి పొందడానికి కృషి చేస్తున్నాను.’ అని ప్రకటించింది బాలీవుడ్ నటి కృతి సనన్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో పర్పుల్ కలర్ స్పోర్ట్స్ బనియన్.. బ్లాక్ లైక్రా ప్యాంటు ధరించి వర్కవుట్స్ చేస్తోంది కృతి సనన్.

ఆ వీడియోకు ఓ క్యాప్షన్ కూడా జత చేసింది. “ఈ సంవత్సరం చాలా విధాలుగా కఠినమైంది. కానీ.. నేను అనుకున్నదానికంటే చాలా బలంగా ఉన్నానని నాకు అర్థమైంది! కరోనా తర్వాత నా బలాన్ని తిరిగి పొందడం కోసం కసరత్తు చేస్తున్నాను. ఈ సంవత్సరాన్ని ఇలా ముగించాల్సి వచ్చింది’’ అని పేర్కొంది. ‘నేను ఇటీవలే కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. అందులో నెగెటివ్ వచ్చింది. నేను కోలుకోవాలంటూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ తెలిపింది కృతి.

కాగా.. కృతి నెక్స్ట్ మూవీ అభిషేక్ జైన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సెకండ్ ఇన్నింగ్స్”. ఇందులో రాజ్ కుమార్ రావుతో కలిసి నటిస్తోంది కృతి. ఈ చిత్రం షూటింగ్ చండీగడ్ లో జరుపుతుండగాా.. అక్కడే కరోనా పాజిటివ్ రావడంతో కృతి ఇంటికి బయల్దేరింది. ఈ చిత్రంలో పరేష్ రావల్ తోపాటు డింపుల్ కపాడియా నటిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.