Begin typing your search above and press return to search.

రెండోసారి క‌రోనా రాద‌ని లైట్ తీస్కున్న‌ బండ్ల‌కు షాక్!

By:  Tupaki Desk   |   13 April 2021 10:03 AM IST
రెండోసారి క‌రోనా రాద‌ని లైట్ తీస్కున్న‌ బండ్ల‌కు షాక్!
X
ఇది నిజంగా షాకింగ్ విష‌యం. ఒక‌సారి క‌రోనా పాజిటివ్ అని తేలాక చికిత్స‌తో కోలుకున్న న‌టుడు నిర్మాత‌ బండ్ల గ‌ణేష్ కి మ‌రోసారి క‌రోనా పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం అత‌డు అపోలోలో చికిత్స పొందుతున్నారు.

ఇటీవ‌లే వ‌కీల్ సాబ్ స‌క్సెస్ వేదిక‌పై బండ్ల గ‌ణేష్ ప్ర‌సంగం చ‌ర్చ‌నీయాంశ‌మైన‌ సంగ‌తి తెలిసిందే. ఆ ఈవెంట్ అనంత‌రం ఇంటికి వ‌చ్చేశాక గ‌ణేష్ కి జ్వరం వ‌చ్చింద‌ట‌. అయితే రెండోసారి క‌రోనా వ‌చ్చేందుకు ఆస్కారం లేద‌ని భావించి లైట్ తీస్కున్నారు. కానీ జ్వ‌రం త‌గ్గ‌లేదు. ఒళ్లు నొప్పులు ఇబ్బందిపెట్టాయి. దీంతో క‌రోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. అనంత‌రం అపోలోలో చేరారు. అయితే అప్ప‌టికే బెడ్ లు ఖాళీ లేక‌పోడంతో ఆయ‌న మెగాస్టార్ చిరంజీవి రిక‌మండేష‌న్ తీసుకున్నార‌ని తెలిసింది.

2020 ఆరంభంలోనే సినీప్ర‌ముఖుల్లో క‌రోనా సోకిన మొద‌టి వ్య‌క్తిగా బండ్ల పేరు వినిపించింది. ఇప్పుడు రెండో సారి రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ప్ర‌స్తుతం బండ్ల ఆరోగ్యంగానే ఉన్నారు. ఇక వ‌కీల్ సాబ్ ఈవెంట్ కి వెళ్లిన‌వాళ్ల‌లో ప‌లువురు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సెక్యూరిటీకి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ప‌వ‌న్ కూడా ఐసోలేష‌న్ లోకి వెళ్లారు. నిర్మాత దిల్ రాజు ప్ర‌స్తుతం గృహ‌నిర్భంధంలో ఉన్నార‌ని తెలిసింది.