Begin typing your search above and press return to search.

25వ క్రాఫ్టులా త‌గులుకున్న‌‌ మ‌హ‌మ్మారీ!

By:  Tupaki Desk   |   8 Sept 2020 11:15 AM IST
25వ క్రాఫ్టులా త‌గులుకున్న‌‌ మ‌హ‌మ్మారీ!
X
ఆన్ లొకేష‌న్ ఏదైనా కీల‌క బాధ్యత అప్ప‌గిస్తే దానిని స‌వ్యంగా నిర్వ‌ర్తించాలి. ముఖ్యంగా సెట్స్ లో అల‌స‌త్వం కూడ‌దు. ప్రొడ‌క్ష‌న్ విభాగం స‌వ్యంగా ప‌ని చేయ‌క‌పోతే ఈ క‌రోనా క‌ష్ట కాలంలో లేనిపోని స‌మ‌స్య‌లు ముంచుకొస్తాయ‌న్న‌ది ప్ర‌త్యేకించి గుర్తు చేయాల్సిన ప‌నే లేదు. అందుకే ఇటీవ‌ల మ‌న అగ్ర నిర్మాత‌లంతా ఎవ‌రికి వారు మ‌హ‌మ్మారీ నియ‌మ‌నిబంధ‌న‌ల్ని తూ.చ త‌ప్ప‌క ఎంతో క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు.

ప‌ని వేళ‌ల్లో ఆహారం ద్వారా కానీ.. పానీయాల ద్వారా కానీ.. క‌రోనా సోక‌కుండా ఆన్ లొకేష‌న్ ఎంతో జాగ్ర‌త్త తీసుకుంటున్నారు. శానిటైజేష‌న్ విష‌యంలో ఎక్క‌డా రాజీకి రావ‌డం లేద‌ట‌. ఇక కొంద‌రు నిర్మాత‌లైతే ఈ ప‌నుల‌న్నీ తామే స్వ‌యంగా చేసుకుంటున్నార‌ని తెలిసింది. సొంతంగా న‌మ్మ‌క‌స్తులైన వారికే ఈ ప‌నిని అప్ప‌గిస్తున్నార‌ట‌. ఎలానూ ఇది 25 వ క్రాఫ్టులా త‌ప్ప‌నిస‌రి అయ్యింది కాబ‌ట్టి దానిని భ‌రించేందుకు ఎంత రిస్క్ అయినా చేస్తున్నార‌ట‌.

డి.సురేష్ బాబు.. దిల్ రాజు... ఏషియ‌న్ సునీల్ నారంగ్ .. వీళ్లంతా ఇదే బాప‌తు. ఇక నారంగ్ నిర్మిస్తున్న ల‌వ్ స్టోరి చిత్రీక‌ర‌ణ తాజాగా ప్రారంభం కాగా.. ఆన్ లొకేష‌న్ సొంత స్టాఫ్ తో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. రిస్క్ చేసేందుకు స‌సేమిరా అంటూ స్వ‌యంపాకాన్ని స్టాఫ్ కి పంపిస్తున్నార‌ట‌. తేడాలొస్తే అంతే సంగ‌తి. డ‌బ్బు మంచినీళ్ల‌లా వృధా అవుతుంది. ఎంత చేసినా ఇన్ టైమ్ లో పూర్తి చేయ‌డం క‌ష్టం. అందుకే ఇన్ని జాగ్ర‌త్త‌లు. ల‌వ్ స్టోరి 25 శాతం చిత్రీక‌ర‌ణ పెండింగు ఉంది. డిసెంబ‌ర్ చివ‌రిలో రిలీజ్ కి రెడీ చేయాలంటే శ‌ర‌వేగంగా పెండింగ్ షూట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మ‌రోవైపు దిల్ రాజు... సురేష్ బాబు సైతం షూటింగుల విష‌య‌మై ప‌క్కా ప్ర‌ణాళిక‌తో మూవ్ కానున్నారు.