Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో కోట్లలో నష్టపోయింది ఆ నలుగురేనా...?

By:  Tupaki Desk   |   14 May 2020 1:40 PM IST
టాలీవుడ్ లో కోట్లలో నష్టపోయింది ఆ నలుగురేనా...?
X
టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం నలుగురు గుప్పిట్లో ఉందని.. ఆ నలుగురు ఇండస్ట్రీలో మాఫియాగా తయారయ్యారని.. ఇండస్ట్రీని ఏలుతున్న ఆ నలుగురు ఓకే అంటేనే సినిమాలు విడుదల అవుతాయని.. ఒకవేళ వారు గనుక సినిమాలని ఆపెయ్యాలి అంటే ఆ సినిమా విడుదల కాదని.. థియేటర్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొని ఇండస్ట్రీని శాసిస్తూ వస్తున్నారని.. ఇలాంటి మాటలు ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పుడూ వినబడుతుంటాయి. అయితే ఇప్పుడు కరోనా క్రైసిస్ వల్ల ఆ నలుగురి పరిస్థితి ఏంటని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీ మీద కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీని నుండి ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే దీని ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూతబడిపోయాయి. దీంతో సినిమా రిలీజులు లేక డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబ్యూటర్లు నష్టాలను చవిచూస్తున్నారు. నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబ్యూటర్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తు సమయంలో తీవ్రంగా నష్ట పోయారని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా థియేటర్స్ అన్నీ వారి చెప్పు చేతల్లో పెట్టుకున్న ఆ నలుగురుకి ఎక్కువగా నష్టం వాటిల్లిందట.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో థియేటర్లు ఈ నలుగురి అధీనంలోనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా క్రైసిస్ లో వాటి నుంచి వచ్చే ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. ఇన్కమ్ వచ్చినా రాకపోయినా సిబ్బందికి వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వీరిపై పడ్డ మరో భారం. ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు బయటకి వచ్చేలా కనిపించడంలేదు. సినిమాలు విడుదలైనా కాకపోయినా థియేటర్స్ రెంట్స్ ఎంతో కొంత కట్టాల్సిన పరిస్థితి.. ఇప్పట్లో సినిమాల విడుదల అనేది ఉండకపోవచ్చు. దీంతో వీరికి కోట్లల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఈ నష్టం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పలేము. ఈ నలుగురు ఇప్పటికే కరోనా క్రైసిస్ నష్ట నివారణ చర్యలు తీసుకోడానికి ఆలోచనలో పడ్డారట. ఇన్ని రోజులు ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకొని శాసించిన ఆ నలుగురు ఇప్పుడు కరోనా గుప్పిట్లో చిక్కుకొని అల్లాడి పోతున్నారంటూ.. కరోనా వచ్చి వారిపై కోట్లలో దెబ్బేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద సినీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతరులతో పోల్చుకుంటే ఈ నలుగురికి కరోనా నష్టం అధికంగానే ఉందని చెప్పవచ్చు.