Begin typing your search above and press return to search.
రాబోయే రోజుల్లో థర్డ్ పార్టీ బయ్యర్లదే హవా కానుందా...?
By: Tupaki Desk | 3 May 2020 7:00 AM ISTకరోనా ఎఫెక్ట్ కారణంగా సినీ ఇండస్ట్రీ మీద కోలుకోలేని దెబ్బపడినట్టే కనిపిస్తోంది. రెండు వారాలు అనుకున్న లాక్ డౌన్ ఇప్పటికే మూడు సార్లు పొడిగించుకుంటూ వచ్చారు. కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో... ఎప్పుడు సాధారణ పరిస్థితి వస్తుందో చెప్పలేని సిచ్యుయేషన్. ఈ నేపథ్యంలో భారత చిత్ర పరిశ్రమ మునుపెన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితులని ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నో విపత్తులను సినీ ఇండీస్ట్రీ ఎదుర్కొన్నప్పటికీ ఇలాంటి క్లిష్ట పరిస్థితులను మాత్రం ఎదురుకాలేదు. కరోనా వైరస్ కారణంగా ఎగ్జిబిషన్ రంగం ఎక్కువగా ప్రభావితమైందని చెప్పవచ్చు. నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబ్యూటర్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తు సమయంలో తీవ్రంగా నష్టపోయారని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో ఈ ప్రభావం వల్ల ఇండస్ట్రీలో పెను మార్పులు చేసుకోబోయే అవకాశం ఉంది. రోజురోజుకి ఇండస్ట్రీలో సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. క్రైసిస్ తరువాత థర్డ్ పార్టీ బయ్యర్లదే హవా కానుందా అనే అనుమానం కలగక మానదు.
ఎందుకంటే షూటింగ్స్ కోసం నిర్మాతలకి డబ్బులు సర్ధే ఫైనాన్సియర్లు భారీగా వడ్డీలు వసూలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఆరు రూపాయలు వడ్డీ కాస్తా 15 రూపాలకి ఎగబాకినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే ఇంత భారీ మొత్తంలో వడ్డీలు కట్టి.. అప్పులు చేసి సినిమాలు తీసే నిర్మాతలు ఆ భారాన్ని డిస్ట్రీబ్యూటర్లు మీద వేస్తారు. సింగిల్ హాండ్ లో ఏ డిస్ట్రీబ్యూటర్ కూడా నిర్మాతలు అంచనాలకు మించి రిటర్న్స్ ఇవ్వలేరు. అలా వారు రిటర్న్స్ ఇవ్వాలంటే థియేటర్స్ ని థర్డ్ పార్టీలకు ఎక్కువ రేటుకి అమ్మాలి. నిజానికి ఇలాంటి పరిస్థితులు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎదరవుతుంటాయి. రెండు రోజులు థియేటర్ లీజు తీసుకోవడం.. లేకపోతే సింగిల్ సెంటర్ ని రెండు వారాలకి లీజు తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రతి సినిమాకి ఇదే జరగొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే సినిమా బాగుంటే ఇలా కొనుకున్న థర్ట్ పార్టీ వారు బాగుపడతారు లేకపోతే నష్టాలను చవిచూస్తారని చెప్పవచ్చు. అయితే సినీ ఇండస్ట్రీ మాత్రం లాభాల్లో ఉంటుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో థర్డ్ పార్టీ బయ్యర్లదే హవా కొనసాగబోతోందని ట్రేడ్ నిపుణులు అంగీకరిస్తున్నారు. మరి ,ముందు రోజుల్లో ఇండస్ట్రీలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో చూడాలి.