Begin typing your search above and press return to search.

#క‌రోనా: కాస్ట్ కటింగ్.. పారితోషికాల‌ కోతపై బిగ్ డిబేట్!

By:  Tupaki Desk   |   21 April 2020 2:30 AM GMT
#క‌రోనా: కాస్ట్ కటింగ్.. పారితోషికాల‌ కోతపై బిగ్ డిబేట్!
X
మార్కెట్ ఎప్పుడూ డిమాండ్ - స‌ప్ల‌య్ సూత్రంపై ఆధార‌ప‌డినా.. క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో ఇప్పుడు ఆ ఫార్ములాకి చెక్ ప‌డిపోనుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ముఖ్యంగా వినోద‌ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా బాంబ్ ప్ర‌భావం మామూలుగా లేదు. ఇప్ప‌టికిప్పుడు సెట్స్ పై ఉన్న అన్ని సినిమాల బ‌డ్జెట్లు కుదించాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తోంద‌ని ఓ ప్ర‌ముఖ అన‌లిస్ట్ విశ్లేషిస్తున్నారు. బ‌డ్జెట్ల కుదింపు అంటే .. అందులో మెజారిటీ వాటా అందుకునే హీరోలు.. ద‌ర్శ‌కులు.. టాప్ టెక్నీషియ‌న్స్ పారితోషికాల త‌గ్గింపు అనే అర్థం. ముఖ్యంగా హీరో- ద‌ర్శ‌కుడు క‌లిసి స‌గం బ‌డ్జెట్ ని త‌మ ఖాతాలో వేసుకునే స‌న్నివేశం ఉంది కాబ‌ట్టి .. ఈ క‌ష్ట కాలంలో వీళ్లు త‌గ్గ‌క త‌ప్ప‌ద‌ని విశ్లేషిస్తున్నారు. అంతేకాదు పెద్ద రేంజు పారితోషికాలు అందుకునే ప్ర‌తి టెక్నీషియ‌న్ ఈ క‌రోనా వేళ నిర్మాత‌ల్ని అర్థం చేసుకుని త‌గ్గాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికిప్పుడు సెట్స్ పై ఉన్న పాన్ ఇండియా సినిమాల విష‌యంలో స‌న్నివేశం చూస్తుంటే అమాంతం కాస్ట్ క‌టింగ్ త‌ప్ప‌ద‌నే అర్థ‌మ‌వుతోంది. ఎస్.ఎస్.రాజ‌మౌళి.. దాన‌య్య‌.. దిల్ రాజు .. డి.సురేష్ బాబు.. యూవీ వంశీ-ప్ర‌మోద్ ద్వ‌యం.. స‌హా ప్ర‌ముఖులంతా ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల కాస్ట్ క‌టింగ్ మ్యాట‌ర్స్ ని సీరియ‌స్ గానే థింక్ చేస్తున్నార‌ట‌. ఆర్.ఆర్.ఆర్ ఇప్ప‌టికే 70 శాతం పూర్త‌య్యింది అన్నారు కాబ‌ట్టి ఇంకో 30 శాతం చిత్రీక‌ర‌ణ స‌హా నిర్మాణానంత‌ర ప‌నుల్లోనూ కోత పెడ‌తారా? అన్న‌ది చిత్ర‌బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక హీరోలు తార‌క్- చ‌ర‌ణ్ ల‌తో పాటు జ‌క్క‌న్న పారితోషికంలో కోత ఎంత‌? అన్న‌దానిపైనా ఇన్ సైడ్ చ‌ర్చ సాగ‌నుంద‌ట‌. పాన్ ఇండియాల్లో ప్ర‌భాస్ జాన్ స‌న్నివేశం ఇంత‌కు భిన్నంగా ఏమీ లేదు. అటు ప‌వ‌న్ ఇప్ప‌టికే దిల్ రాజు తో క‌మిట్ మెంట్ విష‌యంలో ప్రామిస్ చేశార‌ని కూడా ప్ర‌చార‌మైంది.

ఇన్నాళ్లు పారితోషికాలు.. ఏరియా హ‌క్కులు... లాభాల్లో వాటాలు అంటూ హీరోలు.. ద‌ర్శ‌కులు బాగానే గుంజుకున్నా ఇప్పుడున్న స‌న్నివేశంలో అవేవీ కుద‌ర‌ని ప‌రిస్థితి. క‌రోనా విల‌యం ఇంకో ఆర్నెళ్లు మించి ఉంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. వ్యాక్సినేష‌న్ వ‌చ్చే వ‌ర‌కూ ఇదే స‌న్నివేశం ఉండ‌నుంది. అంత‌కుముందు జ‌నం థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టే ప‌రిస్థితి ఉండ‌ద‌న్న అంచ‌నా వెలువడుతోంది. దీంతో హీరోలు.. ద‌ర్శ‌కుల అద‌న‌పు ఆశ‌ల‌కు కోత ప‌డిపోనుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక దీనిపై నిర్మాత‌ల మండ‌లి సార‌థ్యంలో నిర్మాత‌లు హీరోలు టెక్నీషియ‌న్లతో వ‌చ్చే నెల‌లో భేటీ కానున్నార‌ని తెలుస్తోంది. పంపిణీ వ‌ర్గాలు స‌హా ఎగ్జిబిట‌ర్లు సైతం ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఏం నిర్ణ‌యం తీసుకుంటారు? అన్న‌ది తేలాల్సి ఉంది. అంతా కూచుని మాట్లాడుకుంటేనే ఇలాంటివి ప‌రిష్కారం అవుతాయి. మ‌రి మునుముందు టాలీవుడ్ కార్యాచ‌ర‌ణ ఎలా ఉండ‌నుంది? అన్న‌ది చూడాలి.