Begin typing your search above and press return to search.

ఆర్నెళ్ల పాటు ఇండస్ట్రీకి బ్యాడ్ డేస్?

By:  Tupaki Desk   |   16 April 2020 4:15 AM GMT
ఆర్నెళ్ల పాటు ఇండస్ట్రీకి బ్యాడ్ డేస్?
X
నెల‌.. రెండు నెల‌లు.. మూడు నెల‌లు .. ఈలోగా స‌మ‌స్య‌కు ప‌ర్మినెంట్ సొల్యూష‌న్ దొరుకుతుందా? ఒక‌వేళ దొర‌క్క‌పోతే.. దేశాల‌కు దేశాలు ఇప్ప‌టికే అల్ల‌క‌ల్లోలం అయిపోయాయి. మార్కెట్లు ప‌డిపోయి జ‌న‌జీవ‌నం స్థంభించిపోయింది. మాయ‌దారి క‌రోనా మ‌హమ్మారీ ప్ర‌భావం ఊహించిన దానికంటే వంద రెట్లు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. నెల‌రోజుల లాక్ డౌన్ కే వినోద ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ కుదేల‌యిపోయాయి. అలాంటిది ఈ లాక్ డౌన్ మే - జూన్ లోనూ కొన‌సాగితే అప్ప‌టికి మూడు నెల‌ల పాటు దిగ్బంధ‌నం అయిన‌ట్టే. అయినా అప్ప‌టికీ థియేట‌ర్లు మాల్స్ తెరుచుకునే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.

జూన్ - జూలై నాటికి సినిమాల షూటింగుల‌కు అనుమ‌తులు ల‌భించినా కానీ ప‌రిమిత సిబ్బంధితో మాత్ర‌మే ప‌నుల‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక థియేట‌ర్ల‌కు జ‌నాల్ని అనుమ‌తించేదెపుడు? అంటే జూన్ - జూలై నాటికి సాధ్యం కాక‌పోవ‌చ్చ‌న్న అంచ‌నా వెలువ‌డుతోంది. సోష‌ల్ డిస్టెన్సింగ్ థియేట‌ర్లు మాల్స్ లో సాధ్యం కాని ప‌ని. అందువ‌ల్ల వాటికి ప్ర‌భుత్వాల నుంచి అనుమ‌తి ల‌భించే వీల్లేదు. అలాగే ఒక‌వేళ అనుమ‌తించినా కానీ జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు మాన‌సికంగా సిద్ధంగా ఉంటారా? అన్న‌ది కూడా సందేహ‌మే.

ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు - సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ ఇదే ధైన్యం కొన‌సాగితే ఇండ‌స్ట్రీ కోలుకునే ఛాన్సుంటుందా? అంటే.. అప్ప‌టికే అపార న‌ష్టాలు మూట‌గ‌ట్టుకోవాల్సిందేనన్న విశ్లేష‌ణ సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ర‌క‌ర‌కాల క్యాలిక్యులేష‌న్స్ న‌డుమ చాలా మంది త‌మ సినిమాల్ని డిజిట‌ల్ స్ట్రీమింగ్ సంస్థ‌ల‌కు అమ్మేసుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక భారీ చిత్రాల్ని థియేట్రిక‌ల్ రిలీజ్ మాత్ర‌మే చేయాల్సి ఉంటుంది కాబ‌ట్టి వీళ్లంద‌రికీ న‌ష్టం అంతే పెద్ద‌గా ఉంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. ఎంతో వేచి చూడాలి. ఓపిగ్గా వడ్డీ భారాలు మోయాలి. ఆర్నెళ్ల‌లో స‌మ‌స్య ప‌రిష్కారం అయితే అది గొప్పేన‌ని చెప్పొచ్చు.