Begin typing your search above and press return to search.

చెత్త కంటెంట్ సినిమాలు ఆపితే మంచిది.. అంటున్న సినీవర్గాలు

By:  Tupaki Desk   |   13 April 2020 12:30 PM GMT
చెత్త కంటెంట్ సినిమాలు ఆపితే మంచిది.. అంటున్న సినీవర్గాలు
X
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి రెండు నెలల ముందు నుంచే దయనీయంగా తయారైంది. ఫిబ్రవరి నుంచి సరైన సినిమాలు పడక థియేటర్లు వెలవెలబోతూ కనిపించాయి. ఇంతలో కరోనా మహమ్మారి వచ్చి పడింది. థియేటర్లు మూతపడిపోయాయి. బంగారం లాంటి వేసవి సీజన్ వేస్టయిపోతోంది. ఏప్రిల్ నెలలో థియేటర్లు తెరుచుకునే అవకాశం దాదాపు లేనట్లే. మే మొదటి వారం నుంచి మళ్లీ థియేటర్లలో సిినిమాలు ఆడుతాయని భావిస్తున్నారు. కానీ ఒకవేళ థియేటర్లు పున:ప్రారంభమైనప్పటికీ కొంత కాలం పాటు అక్కడ సాధారణ పరిస్థితులు కనిపించకపోవచ్చు.

జనాలు థియేటర్లు రావడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించవచ్చు. ఒక పక్కన థియేటర్లను కాపాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా మూలంగా ఇప్పటికే పూర్తిగా నష్టాలలో మునిగిపోయిన సినిమా ఇండస్ట్రీ. ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు అయితే కన్పించడం లేదు. కరోనా తర్వాత మెయింటైన్సులను భ‌రించ‌లేక ఎగ్జీబీట‌ర్స్ థియేట‌ర్లు మూసివేసే అవ‌కాశం ఉందట. తెలుగు ఇండస్ట్రీకి ముఖ్యమైన సోర్సు సింగల్ స్క్రీన్ థియేటర్లు. వాటిని కాపాడుకోవాలంటే టాలీవుడ్ హీరోలు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్వాలిటీ కంటెంట్ మాత్ర‌మే థియేట‌ర్లలో ముందు రిలీజ్ అయ్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని భావిస్తున్నారు.

అనవసరంగా కక్రుత్తి పడి చెత్త కంటెంట్ ఉన్న సినిమాలు విడుదల చేస్తే మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లే అపాయం ఉంది. సెన్సార్ స్క్రీనింగ్ చేసిన క్వాలిటీ కంటెంట్ సినిమా జ‌నాల‌కి నచ్చుతుంద‌ని భావిస్తేనే ఆ సినిమాల‌కి థియేటర్లలో ప్రదర్శించాలి. లేక‌పోతే పరిస్థితి చక్క‌బ‌డే వ‌రుకు క్వాలిటీ లేని సినిమాలను వాయిదా వేసుకోవడమే బెటర్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయ ప‌డుతున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో..