Begin typing your search above and press return to search.

వేస‌విని ఊదేసిన‌ క‌రోనా.. నిర్మాత‌ల టెన్ష‌న్!?

By:  Tupaki Desk   |   11 April 2020 12:30 AM GMT
వేస‌విని ఊదేసిన‌ క‌రోనా.. నిర్మాత‌ల టెన్ష‌న్!?
X
లాక్ డౌన్ తో ప్ర‌పంచం స్థంబించిపోయింది. క‌రోనా క‌ల్లోలంలో అన్ని రంగాల్లో దారుణ‌మైన న‌ష్టాలు చ‌విచూడాల్సిన స‌న్నివేశం త‌లెత్తింది. ముఖ్యంగా సినీ రంగంపై ఈ ప్ర‌భావం మ‌రింత అధికంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ లు బంద్ అయ్యాయి. థియేట‌ర్లు మూతప‌డ్డాయి. దీంతో సినిమాలు రిలీజ్ కాని ప‌రిస్థితి. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు కొన్ని అయితే.. షూటింగ్ లు పూర్తిచేసి స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేయాల‌ని ఇంకొంత మంది నిర్మాత‌లు ఆశ‌ప‌డ్డారు. కానీ క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా మొత్తం సీనే రివ‌ర్స్ అయింది. ఇక లాక్ డౌన్ ఎప్ప‌టివ‌ర‌కూ అమలులో ఉంటుందో? చెప్ప‌లేని స‌న్నివేశం ఎదురుగా ఉంది.

ఏప్రిల్ 14 త‌ర్వాత కూడా లాక్ డౌన్ ఎత్తేయ‌డం కుద‌ర‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇప్పటికే హింట్ ఇచ్చేసారు. ఎలా లేద‌న్నా ఏప్రిల్ 14 నుంచి అద‌నంగా మ‌రో 15 రోజులు కొన‌సాగింపు క‌నిపిస్తోంది. అప్ప‌టికీ వైర‌స్ అదుపులోకి రాక‌పోతే మేలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంద‌న‌డంలో సందేహం అక్క‌ర్లేదు. ప్ర‌జ‌ల ప్రాణాలు కంటే.. ఏదీ ముఖ్యం కాద‌ని ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మోదీ ముందు కుండబ‌ద్దలు కొట్టేసారు. ఈ నేప‌థ్యంలో ఎలాంటి నిర్ణ‌యానికైనా ప్ర‌జ‌లు క‌ట్టుబడి ఉండాల్సిన స‌న్నివేశం ఉంది. ఇలా అన్ని విష‌యాల‌ను విశ్లేషించి చూస్తే సినిమాల ప‌రంగా పెద్ద న‌ష్టం త‌ప్ప‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు.

సినిమా రిలీజ్ ల‌కు వేస‌వి ఎంతో కీల‌క‌మైన‌ది. వేస‌వి సెల‌వులు సంద‌ర్భం గా ఇబ్బ‌డి ముబ్బ‌డిగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. మార్చి నెల‌కొని జూన్ వ‌ర‌కూ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. పెద్ద సినిమాల సంగ‌తి ప‌క్క‌న‌ బెడితే ఈ ప్ర‌భావం చిన్న సినిమా నిర్మాత‌ల‌కు గ‌ట్టిగానే త‌గిలిందన్న‌ది విశ్లేష‌ణ‌. దాదాపు మూడు నెల‌ల సెల‌వుల్ని క‌రోనా ఊదేసిన‌ట్లు అయింది. బ్యాంక్ లు మార‌టోరియం స‌దుపాయం క‌ల్పించినా తీసుకున్న రుణాలపై వ‌డ్డీ ల మీద వ‌డ్డీలు క‌ట్ట‌క త‌ప్ప‌దు. దాదాపు రెండు నుంచి మూడు నెల‌లు పాటు వ‌డ్డీల భారం నిర్మాత‌ల‌ పైనా ప‌డుతుందని అంచ‌నా వేస్తున్నారు.

ఇక మ‌నీ రొటేష‌న్ లేక‌పోతే పంపిణీ దారులు.. బ‌య్య‌ర్లు సినిమాల్ని రిలీజ్ చేయ‌లేరు. ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించాలంటే నిర్మాతే ధైర్యం చేసి ముందుకు రావాలి. అలా చేస్తే నిర్మాత ఇంకా న‌ష్టాల్లో కూరుకుపోయే అవ‌కాశం ఉంది. రిలీజ్ త‌ర్వాత వ‌చ్చే లాభ...న‌ష్టాలు ప‌క్క‌న‌బెడితే అంత‌కు ముందే రిలీజ్ కు పెట్టుబ‌డి పెట్టాల్సిన స‌న్నివేశ‌మైతే ఉంది. క‌నీసం కంటికి క‌నిపించిన వైర‌స్ తో వినోద‌ప‌రిశ్ర‌మ సైతం ఎంత పెద్ద‌ యుద్ధం చేయాల్సి వ‌స్తోందో. వేస‌వి సెల‌వుల్లో సినిమాలు రిలీజ్ చేసి క్యాష్ చేస్కోవాల‌న్న నిర్మాత‌ల‌కు ఇది అశ‌నిపాత‌మే అయ్యింది. క‌నీసం వేసవి అయిపోయాక అయినా అందుకు ఛాన్సుందా? అంటే అది కూడా డౌట్ గానే క‌నిపిస్తోంది నేటి సీన్ చూస్తుంటే. ఇక ఫైనాన్సులు తెచ్చిన వాళ్లంతా వ‌డ్డీల‌పై వ‌డ్డీలు క‌ట్టాల్సిన స‌న్నివేశంలో ఎలాంటి విప‌త్క‌ర ప‌రిణామాలు ఉంటాయోనన్న ఆందోళ‌నా ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొని ఉంది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా మ‌హమ్మారీ భారి నుంచి బ‌య‌ట‌ప‌డి ప‌రిశ్ర‌మ కోలుకోవాల‌ని ఆశిద్దాం.