Begin typing your search above and press return to search.

కరోనా దెబ్బకు నిలిచిపోయిన సినిమాలు..

By:  Tupaki Desk   |   8 April 2020 12:30 AM GMT
కరోనా దెబ్బకు నిలిచిపోయిన సినిమాలు..
X
కరోనా వైరస్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ పై కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో వేసవికాలం వస్తే థియేటర్లలో కొత్త సినిమాల సందడి మాములుగా ఉండదు. అలాంటిది కరోనా వైరస్ గత రెండు వారాలుగా థియేర్లను మూసి ఉంచేలా చేసింది. ఈ టైంకి దేశ ప్రజలంతా వారి వారి అభిమాన సినీ తారల సినిమాలను థియేటర్లలో కుటుంబ సమేతంగా వీక్షించేవారు. ఎల్లప్పుడూ పబ్లిక్ తో కిటకిటలాడే థియేటర్లను మూసివేయడంతో జనాలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. టాలీవుడ్ లో చాలా సినిమాలు కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోయి విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి.

అలా కరోనా కారణంగా విడుదల కాకుండా ఆగిన సినిమాలలో టాప్ టాలీవుడ్ సినిమాల జాబితా ఇలా ఉంది. ఈ లిస్టులో మొదటగా యాంకర్ ప్రదీప్ '30రోజుల్లో ప్రేమించడం ఎలా?', పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఉప్పెన', అనుష్క 'నిశ్శబ్దం', రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా', నేచురల్ స్టార్ నాని 'వి', రామ్ హీరోగా 'రెడ్', మాస్ మహారాజ్ రవితేజ 'క్రాక్', పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా 'రొమాంటిక్', నాగచైతన్య, సాయిపల్లవిల 'లవ్ స్టోరీ', దగ్గుబాటి రానా పాన్ ఇండియా మూవీ 'అరణ్య'.. ఇలా చాలా సినిమాలు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఇవేగాక అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', మెగాస్టార్ 'ఆచార్య' సినిమాలు కూడా విడుదలకు సిద్దమవుతున్నాయి. చూడాలి మరి కరోనా పోయేవరకు వెయిట్ చేస్తారో.. లేక ఆల్టర్నేట్ గా డిజిటల్ ప్లాట్ ఫారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తారో.. అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.