Begin typing your search above and press return to search.

టాలీవుడ్ బాక్స్ ఆఫీసుపై కరోనా పిడుగు

By:  Tupaki Desk   |   11 March 2020 4:52 AM GMT
టాలీవుడ్ బాక్స్ ఆఫీసుపై  కరోనా పిడుగు
X
కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాలే బెంబేలెత్తిపోతున్నాయి. అలాంటిది భారతదేశ ప్రజలు ఆందోళన చెందడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ కరోనా దెబ్బకు సాధారణ ప్రజలు ఇంటిపట్టున ఉండడం అలవాటు చేసుకుంటున్నారు. దీంతో టాలీవుడ్ సినిమాలకు గడ్డుకాలం వచ్చి పడింది. అసలే ఈమధ్య పరిక్షల సీజన్ కావడంతో థియేట్రికల్ కలెక్షన్స్ లో తగ్గుదల కనిపిస్తోంది. ఈ కరోనా తో ఆ ప్రభావం మరింత తీవ్రమైంది.

ఇప్పటికే కేరళ లో థియేటర్లను మూసి వేసినట్టు వార్తలు వచ్చాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి రావొచ్చని అంటున్నారు. దీంతో మార్చ్ నెలాఖరున విడుదలకు షెడ్యూల్ అయి ఉన్న సినిమాలను వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి కరోనా ప్రభావం లేకపోతే ఈ సినిమాలు వాయిదా లేకుండా ముందుగా ప్రకటించిన సమయానికి విడుదల అవుతాయి.

ఈ వాయిదా పుకార్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి కాబట్టి నిజంగా సినిమాలను రిలీజ్ చేసే పక్షంలో ప్రచారం జోరుగా చెయ్యాలి. 'V'.. అలాగే ఇతర సినిమాల టీమ్స్ భారీ ప్రచారం చేస్తేనే ప్రేక్షకులు కూడా కరోనా వైరస్ సంగతి పక్కన పెట్టి థియేటర్లకు వస్తారు. అలా ప్రచారం కనుక చేపట్టకపోతే కరోనా వైరస్ భయం తగ్గినప్పటికీ కొన్ని రోజులు సినిమాల థియేటర్లలో చూడకపోతే కొంపలేమైనా మునిగిపోతాయా.. ఇంట్లోనే ఉందాం అనే ఆలోచనలతో థియేటర్ల మొహం చూడరు.

ఏదేమైనా ఈసారి టాలీవుడ్ కు సమ్మర్ సీజన్ నీరసంగానే ఉండబోతోందని అంటున్నారు. కారణం స్టార్ హీరోల సినిమాలు ఒక్కటి కూడా రిలీజ్ కావడం లేదు. దానికి తోడు కరోనా ఎఫెక్ట్ కూడా సమ్మర్ సీజన్ పై ప్రభావం చూపిస్తోంది. మరి మన టాలీవుడ్ సినిమాలు ఈ ప్రభావం నుంచి ఎలా బయటకు వస్తాయో వేచి చూడాలి.