Begin typing your search above and press return to search.
కరోనా దెబ్బకి ఆ బడా నిర్మాత కుదేలవుతున్నాడా..?
By: Tupaki Desk | 11 April 2020 10:30 AM ISTకరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావం ఎక్కువగా పడిన రంగాల్లో సినీ ఇండస్ట్రీ ఒకటి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై ఈ ఏడాది చివరి వరకు కొనసాగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో సినిమా మీద ఆధారపడి జీవించే కొన్ని లక్షల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇప్పటికే మల్టీప్లెక్స్ లు - థియేటర్లు మూసి వేయడంతో నిర్మాతలు డిస్టిబ్యూటర్స్ - థియేటర్ల ఓనర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. టాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ రిలీజ్ డేట్లను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఒకవేళ త్వరలోనే లాక్ డౌన్ ఎత్తేసినా తమ సినిమాల విషయంలో కొంతమంది పెద్ద నిర్మాతలు చాలా టెన్షన్ పడుతున్నారట. మరీ ముఖ్యంగా వారిలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఒక బడా నిర్మాత ఎక్కువగా భయపడుతున్నారట.
వివరాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేసినా సినిమా థియేటర్లు వెంటనే ఓపెన్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ జులై లేదా ఆగష్టు నెలల్లో ఓపెన్ చేసినా ఈ బడా బ్యానర్ నుండి రిలీజయ్యే సినిమాలు.. పెట్టిన బడ్జెట్ వెనక్కి తెచ్చేలా కనపడటం లేదంట. కారణం ప్రస్తుతం ఈ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేస్తున్న అన్ని సినిమాల బడ్జెట్ అనుకున్నదానికంటే డబుల్ అవటమేనట. అందుకే ఇవి రిలీజై హిట్ అయినా కమర్షియల్ సక్సెస్ కి దూరంగా ఉండే అవకాశం ఉందని సదరు నిర్మాత భయపడుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. వాటిలో ముఖ్యంగా ఇద్దరు యువ హీరోలతో తీసి సమ్మర్ లో రిలీజ్ కి సిద్ధం చేసిన ఒక సినిమాకి బడ్జెట్ డబుల్ అయిందని టాక్. ఈ సినిమాలో నటిస్తున్న హీరోలతో పాటు హీరోయిన్లు - డైరెక్టర్ అందరూ మంచి ఫార్మ్ లో ఉన్న వాళ్లే. వీళ్ళ మార్కెట్ పరిగణలోకి తీసుకున్నా ఈ సినిమా దాదాపు 45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయాలి. అంతేకాకుండా సుమారు 15 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ బిజినెస్ చేయాలి. ఈ పరిస్థితుల్లో నాన్ థియేట్రికల్ బిజినెస్ వర్క్ అవుట్ అయినా 45 కోట్లు వెనక్కి రాబట్టకపోతే మాత్రం ఈ సినిమా ఆ బడా ప్రొడ్యూసర్ కి పెద్ద కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోతుందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా ఒక సీనియర్ హీరో కంబ్యాక్ మూవీకి కూడా ఈయన ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆ స్టార్ హీరో స్టామినాని నమ్ముకొని ఈ సినిమాకి దాదాపు 75 కోట్ల దాకా బడ్జెట్ పెట్టారట సదరు నిర్మాత. ఈ బడ్జెట్ ని బట్టి చూసుకుంటే ఈ సినిమా నాన్ థియేట్రికల్ మరియు థియేట్రికల్ కలుపుకొని సుమారు 125 కోట్ల దాకా బిజినెస్ చేయాలి. ఈ సినిమా కంటెంట్ పరంగా చూసుకున్నా.. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ పరిస్థితులు చూసుకున్నా.. ఆ సినిమా అంత వాసులు చేసే అవకాశం లేదని మార్కెట్ వర్గాల అభిప్రాయం. మరి ఈ పరిస్థితులను తట్టుకొని ఆ ప్రొడ్యూసర్ అండ్ టీమ్ ఎంత వరకు నెగ్గుకురాగలరో చూడాలి. ఈ సినిమాలు భారీ హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేయాలి. ఈ బ్యానర్ వాళ్ళు ప్రమోషన్స్ సరిగా చేయరని ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్న టాక్. మరి ఈ బడా నిర్మాత ఈ పరిస్థితుల నుండి ఎలా బయటపడతాడో చూడాలి.