Begin typing your search above and press return to search.
#క్రైసిస్.. పాపం సైడ్ ఇన్ కం అలా పడిపోయిందట
By: Tupaki Desk | 20 Dec 2020 9:00 AM ISTకరోనా మహమ్మారీ అన్ని పరిశ్రమల్ని దెబ్బ కొట్టింది. అందునా సినీపరిశ్రమలను దారుణంగా దెబ్బ కొట్టిందన్న విశ్లేషణ సాగుతోంది. షూటింగుల్లేక.. రిలీజుల్లేక ఆదాయాలు సున్నా అయిపోవడంతో ఆ ప్రభావం చిత్రపరిశ్రమ కార్మికులు సహా చిన్నా చితకా నటీనటులు హాస్యనటులు తదితరులపై పడింది.
అయితే ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కోలుకుంటున్నా.. పాపం చోటామోటా స్టార్లు జబర్థస్త్ స్టార్లు కమెడియన్లు తమకు దక్కే విశిష్ఠ ఆదాయాన్ని కోల్పోయారని విశ్లేషిస్తున్నారు. ఇంతకుముందు పండగొచ్చినా పబ్బమొచ్చినా ఏదో ఒక కార్యక్రమం పేరుతో అమెరికా యుకే ఆస్ట్రేలియా దుబాయ్ అంటూ సెలబ్రేషన్ కి వెళ్లేవారు. అక్కడి నుంచి భారీగానే ఆదాయ ఆర్జన సాగేది. విదేశీ చిలౌట్ కార్యక్రమాలతో చక్కగానే దండుకునేవారు. కానీ కరోనా కొట్టిన దెబ్బకు అదంతా జీరో అయిపోయిందట.
విదేశాలకు వెళ్లాలంటేనే కరోనా భయం. ఇక విదేశీ షోల నిర్వహణ కూడా నిలిచిపోవడంతో ఆ రకంగా పంచ్ పడిపోయింది. ముఖ్యంగా అమెరికాలాంటి చోట ఇక తిరిగి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదుట. అనేక దేశాలు వీసా ఆంక్షలను తిరిగి విధించడం .. రెండవ సారి లాక్డౌన్ అమలు చేయడంతో సదరు సెలబ్రిటీలు తమ సైడ్-ఆదాయాన్ని తిరిగి పొందటానికి అవకాశాలు తగ్గిపోయాయని తెలుస్తోంది. ఇక విదేశాల్లో పలు భారతీయ అసోసియేషన్లు ఎప్పటికప్పుడు స్పెషల్ కార్యక్రమాలు పేరుతో భారీ ఈవెంట్లు నిర్వహిస్తూ డాలర్లలో ఆర్జించేవి. వాటి నుంచి పెర్ఫామెన్స్ కి విచ్చేసిన బృందాలకు బాగానే ముట్టజెప్పేవి. ఇప్పుడు అదంతా గుండు సున్నా. దీంతో సైడ్ బిజినెస్ డల్ అయిపోయినందుకు తెగ పరేషాన్ అయిపోతున్నారట మన తారలు. ఇక ఈ కేటగిరీలో పెద్ద తెర బుల్లితెర హాస్యనటులతో పాటు సింగర్లు కూడా ఉన్నారు. అయితే ఇలా కోల్పోయిన ఆదాయాన్ని వెబ్ సిరీస్ లలో నటించడం ద్వారా రికవరీ చేయాలని ప్రయత్నిస్తున్నారట.