Begin typing your search above and press return to search.
జబర్ధస్త్, కార్తీకదీపం అందుకే దెబ్బతిన్నాయా?
By: Tupaki Desk | 18 May 2020 11:30 AM ISTదేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో లాక్ డౌన్ అనివార్యమైంది. ప్రస్తుతం 4వ దశ నడుస్తోంది. కొన్ని సడలింపులు ఇచ్చినా కీలకమైన సినిమాలు, షూటింగ్ లకు ఇప్పట్లో అనుమతులు ఇవ్వమని కేంద్ర, రాష్ట్రాలు స్పష్టం చేశాయి. దీంతో రెండు మూడు నెలలుగా సినిమాలు, సీరియల్స్ షూటింగ్ ఆగిపోవడంతో బుల్లితెర వెలవెలబోతోంది. వీటిపైనే ఆధారపడ్డ నటులు, సినీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఇన్నాళ్లు సినిమాలను మించి బుల్లితెర గట్టిపోటీనిచ్చేది. ముఖ్యంగా సినిమాల రేటింగ్ లను మించి జబర్ధస్త్ కామెడీ షోకు, కార్తీకదీపం సీరియళ్లకు విపరీతమైన టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. ఈ రెండింటికి బుల్లితెరపై భారీ డిమాండ్ ఉండేది. కొత్త సినిమాలు వేసినా రాని రేటింగ్స్ ఈ రెండు కార్యక్రమాలకు వచ్చేవి.
అలాంటిది తాజాగా ఈ రెండు ప్రోగ్రామ్స్ కు కరోనా షాక్ తగిలింది. సీరియళ్లు అన్ని ఆగిపోవడంతో ప్రేక్షకుల కోసం ‘కార్తీకదీపం’, జబర్ధస్త్ షోలను రీపీట్ చేసి వేస్తున్నారు. ప్రేక్షకులంతా ఇంటికే పరిమితం కావడంతో వీటిని ఎగబడి చూస్తారని.. టాప్ టీఆర్పీ వస్తుందని సదురు చానెళ్లు అంచనావేశాయి.
కానీ కార్తీకదీపం, జబర్ధస్త్ టీఆర్పీ రేటింగులు పడిపోయాయి. ఖాళీగా ఉన్న జనాలు వీటికంటే సినిమాలు, ఓటీటీ ఫ్లాట్ ఫాంలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడడానికి ఇష్టపడుతున్నారు. దీంతో టీఆర్పీ రేటింగుల్లో కార్తీక దీపం సీరియల్ మూడో స్థానానికి పడిపోగా.. జబర్ధస్త్ ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది.
ఎప్పుడూ మొదటి రెండు స్థానాల్లో పదిలంగా ఉండే ఈ రెండు ప్రోగ్రామ్స్ ఇలా పడిపోవడం చూసి చానెల్స్ నిర్వాహకులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం కొన్ని ఆసక్తికర సినిమాలు, స్పెషల్ ప్రోగ్రాములనే జనాలు చూస్తున్నారు. వాటికే టీఆర్పీ రేటింగ్ వస్తోంది.