Begin typing your search above and press return to search.

ల‌గ్జ‌రీ లైఫ్ ఉఫ్! లాక్ డౌన్ తో చిన్న‌ రేంజ్ స్టార్ల క‌ష్టం!!

By:  Tupaki Desk   |   22 April 2020 11:00 AM IST
ల‌గ్జ‌రీ లైఫ్ ఉఫ్! లాక్ డౌన్ తో చిన్న‌ రేంజ్ స్టార్ల క‌ష్టం!!
X
లాక్ డౌన్ తో అంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్ ప‌రిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. పెట్టుబడులు పెట్టే నిర్మాత‌లు ఈ ఫేజ్ నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా అని స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. గ‌డిచిన నెల రోజుల‌కే ఇలాంటి ప‌రిస్థితి ఉందంటే లాక్ డౌన్ మ‌రో మూడు నెల‌లు కొన‌సాగితే ప‌రిస్థితి ఏమిటా? అన్న టెన్ష‌న్ మొద‌లైంది. ఇక స్టార్ హీరోలు.. ద‌ర్శ‌కుల‌కు పెద్ద‌గా ఇబ్బందులు ప‌రిమిత‌మే కానీ.. టైర్ 2.. టైర్ 3 కంటే దిగువ‌న ఉన్న న‌టీన‌టుల ప‌రిస్థితేమిటి? అంతా ఇళ్ల‌కే అంకిత‌‌మై కుటుంబంతో ఉన్నారు. దీంతో ఇబ్బందుల‌న్ని చిన్న స్థాయి హీరోలు.. న‌టులు.. సాంకేతిక నిపుణుల‌వేన‌ని అంటున్నారు. ఇప్ప‌టికే నెల రోజులు లాక్ డౌన్ తో బ్యాంక్ ఖాతాల్లో సొమ్ములు ఖాళీ అయిపోతున్నాయి.

సెల‌బ్రిటీ వర‌ల్డ్ లో బ్ర‌తకాలంటే అక్క‌డ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌ని లేక‌పోయ‌నా బిల్డ‌ప్ విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌రు. ఖ‌రీదైన జీవితం కాబ‌ట్టి అంతే కాస్ట్ లీగా బ్ర‌తకాలి అన్న‌ ఆశ మాత్రం చావ‌దుగా. ఇదే చిన్న స్థాయి న‌టీన‌టుల‌ను..అప్ క‌మింగ్ ఆర్టిస్టుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ట‌. లాక్ డౌన్ మ‌రో మూడు నెల‌లు గ‌నుక పొడిగిస్తే తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని టెన్ష‌న్ ప‌డుతున్నారు. చేతిలో సినిమాలుంటే హీరోకి రూపాయి ఖ‌ర్చు ఉండ‌దు. అన్నిటినీ నిర్మాత నెత్తి‌నే రుద్దుతారు కాబ‌ట్టి జేబులోంచి రూపాయి తీసే ప‌ని ఉండ‌దు. రేంజ్ చూపించుకోవ‌డం కోసం వీళ్ల‌లో చాలామంది భారీగా వెచ్చించి ల‌గ్జ‌రీ ఖ‌ర్చులు పెడుతుంటారు. ఇంకా ఫ్లాట్.. కార్ ఇలా చాలా వాటికి వీరంతా ఈ.ఎమ్.ఐ లు క‌ట్టాల్సి ఉంటుంది.

అయితే తాజా ప‌రిస్థితుల్లో పెద్ద ఈఎంఐలు ఉన్నోళ్లే పేదోళ్లు అని చెప్పాలి. స్టార్ హీరోలు.. బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు.. మీడియం రేంజ్ హీరోల సంగ‌తి అటుంచితే ఇండ‌స్ట్రీ లో చిన్న సినిమాల‌కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన హీరోలు న‌టీన‌టులకే ఈ చిక్కుల‌న్నీ. అటు పెద్ద పెద్ద డిమాండ్స్ చేయకుండా ఇటు హీరో కంటే దిగువ క్యారెక్ట‌ర్స్ చేయ‌కుండా.. స‌రైన బ్రేక్ కోసం ఎద‌రు చూస్తూ ఉండే హీరో హీరోయిన్లు .. చాలా మంది ఉన్నారు. వీళ్ల‌కు స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని విశ్లేషిస్తున్నారు. ల‌గ్జ‌రీ ఫ్లాట్.. కాస్ట్ లీ కార్ ఇలా చాలా వాటికి ఈ.ఎమ్.ఐ లు క‌ట్టాల్సి ఉంటుంది..! అందుకే వీళ్ల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏదో ఒక‌ నెల పాటు మ్యానేజ్ చేయ‌గ‌లిగినా.. ఏకంగా మూడు నాలు‌గు నెల‌లంటే చిన్న స్థాయి హీరోలంతా ఇబ్బందులు ప‌డాల్సిందే. ఆ ఇబ్బందుల‌ను స‌హనంతో ఫేస్ చే‌య‌గ‌లిగితే ప‌ర్వాలేదు. లేదంటే అన్ని ఖర్చులు‌ ఒకేసారి వ‌చ్చి మీద ప‌డేస‌రికి డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయే ప్ర‌మాదం ఉందని ప‌రిశ్ర‌మ పెద్ద‌లు వాపోతున్నారు. మ‌రి ఈ స‌న్నివేశాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.