Begin typing your search above and press return to search.
మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం.. బాధ్యతారాహిత్యమే కారణమంటున్న ఫ్యాన్స్..!
By: Tupaki Desk | 29 Dec 2020 8:00 PM ISTకరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న విలయ తాండవం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ కొన్ని నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసింది. ఈ క్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. మరికొంత మంది మృతి చెందారు. ఆ మధ్య కరోనా తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తేసి నిబంధనలను సడలించారు. అయినప్పటికీ మహమ్మారిని ఇంకా నిర్మిలించలేదు కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సినిమా వాళ్ళు సైతం లొకేషన్ లో కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ సేఫ్టీ మెజర్స్ తో షూటింగులు జరుగుకుంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అందరూ మాస్కులు ధరించాలని శానిటైజ్ చేసుకోవాలని జాగ్రత్తలు చెబుతూ తమ వంతు బాధ్యత నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఒకేసారి ఇద్దరు హీరోలకు కరోనా సోకడంపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ రూపు మార్చుకొని కొత్తగా వస్తుందనే వార్తలు వస్తుండటంతో ప్రజలందరూ భయబ్రాంతులకు గురి అవుతున్నారు. అందులోనూ క్షేత్రస్థాయిలో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో అందరూ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ - వరుణ్ తేజ్ లు కరోనా బారిన పడటంతో వీరు బాధ్యతాయుతంగా ఉండకపోవడంతోనే ఇలా జరిగిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల చరణ్ హోస్ట్ చేసిన క్రిస్మస్ పార్టీలో ఎవరూ కూడా మాస్కులు ధరించినట్లు జాగ్రత్తగా ఉన్నట్లు కనిపించలేదని.. అక్కడే వీరికి కోవిడ్ అటాక్ అయ్యుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన చరణ్-ఉపాసన లతో పాటు అల్లు అర్జున్-స్నేహ.. నిహారిక-చైతన్య.. కళ్యాణ్ దేవ్-శ్రీజ.. విష్ణు ప్రసాద్-సుష్మిత.. వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ - పంజా వైష్ణవ్ తేజ్ - అల్లు శిరీష్ - అల్లు బాబీ మరియు పిల్లలు హాజరయ్యారు. ఇప్పుడు ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో మిగతా వారి పరిస్థితి ఏంటని అభిమానులు కలవరపడుతున్నారు.
సామూహిక పార్టీలు చేసుకునేప్పుడు కేర్ ఫుల్ గా ఉంటే బాగుండేదని.. ఇప్పుడు చరణ్ - వరుణ్ లు గత రెండు మూడు రోజుల్లో ఇంకెవరిని కలిసారో అని డౌట్ పడుతున్నారు. ఇప్పుడు వీరితో సినిమాలు చేస్తున్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లకి మళ్ళీ లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టారని.. ఇంకొన్ని రోజులు షూటింగ్స్ నిలిపివేసే పరిస్థితి తీసుకొచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' తో పాటు 'ఆచార్య' షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. రెండు రోజుల క్రితం 'ఆచార్య' సెట్ లో చరణ్ పలువురితో చేతులు కలిపివచ్చాడు. అలానే అనేక వాయిదాలు పడుతూ వస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' షూట్ లో చరణ్ ఇప్పుడల్లా పాల్గొనలేడు. కరోనా నుంచి కోలుకుని చెర్రీ రావడానికి కనీసం రెండు వారాలైనా పడుతుంది. ఇక వరుణ్ తేజ్ కూడా 'ఎఫ్ 3' తో పాటు మరో స్పోర్ట్స్ డ్రామా షూటింగ్స్ చేయాల్సి ఉంది. ఇప్పుడు వీరికి కరోనా సోకడం వల్ల షూటింగ్ ప్లాన్స్ అన్నీ మారిపోనున్నాయి. అందుకే సినీ స్టార్స్ మరింత బాధ్యతాయుతంగా ఉండి మరింత జాగ్రత్తగా ఉంటే బాగుండేదని నెటిజన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు. అలానే కరోనా బారిన పడిన చరణ్ - వరుణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.