Begin typing your search above and press return to search.

మన్మథుడు 2 మీద కాపీల కథనాలు

By:  Tupaki Desk   |   15 Jun 2019 12:10 PM IST
మన్మథుడు 2 మీద కాపీల కథనాలు
X
సోషల్ మీడియా వాడకం విస్తృతమయ్యాక ఇంతకు ముందులా దర్శకులు రచయితలు ఈజీగా కాపీ కొట్టి తప్పించుకునే పరిస్థితి లేదు. అందులోనూ స్టార్ హీరోలతో చేస్తున్నపుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆ మధ్య అజ్ఞాతవాసి విషయంలో ఎంత రచ్చ జరిగిందో కళ్ళారా చూశాం . ఇదేమి కొత్తది కాదు. అంతకు ముందు లేనిది కాదు కాని టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచ సినిమా జ్ఞానం జనంలో పెరిగిపోతోంది. బాషతో సంబంధం లేకుండా చూడాలని కోరుకుంటే చాలు అవి నట్టింట్లోకి నడుచుకుంటూ వస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఇప్పుడు మన్మధుడు 2 స్టొరీ మీద కూడా అలాంటి ప్రచారమే ఒకటి వచ్చేసింది. 13 ఏళ్ళ క్రితం వచ్చిన ఫ్రెంచ్ మూవీ ప్రేతే మెయి తా ఐ ఆధారంగా కింగ్ సినిమా కథను రాసుకున్నారని వాటి సారాంశం. అందులో నలభై వయసు వచ్చిన హీరోని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్న ఇంట్లో వాళ్ళ పోరు పడలేక బయట నుంచి ఓ అద్దె భార్యను తీసుకొచ్చి నమ్మిస్తాడు. తీరా కాలం గడిచే కొద్ది ఇద్దరి మధ్య అనుబంధం గట్టిపడుతుంది. కాకపోతే ఇదేమి కొత్త పాయింట్ కాదు.

అప్పుడెప్పుడో అల్లుడుగారు తో స్టార్ట్ చేస్తే బావగారు బాగున్నారా దాకా కొనసాగుతూనే ఉంది. కాకపోతే ప్రతి సారి హీరో అద్దెకు వస్తాడు. ఇందులో వెరైటీగా హీరొయిన్ దొరుకుంది. ఇది నిజమా కాదా అని ఇప్పుడే నిర్ధారణకు రాలేం. కనీసం ట్రైలర్ వచ్చాక విశ్లేషణ చేయొచ్చు కాని ఇప్పుడే అనడం తొందరపాటు అవుతుంది. ఒకవేళ వాస్తవమే అయితే ఓ బేబీ తరహాలో అఫీషియల్ గా హక్కులు కొన్నారా లేదా ఇదంతా కేవలం గాసిప్పా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే కాని క్లారిటీ రాదు