Begin typing your search above and press return to search.

దేవిపై ఈ కాపీ ముద్రేల?

By:  Tupaki Desk   |   20 Dec 2016 5:30 PM GMT
దేవిపై ఈ కాపీ ముద్రేల?
X
పసిపిల్లాడి నుండి పండు ముసలాళ్ళ వరకూ బీట్ కి తమ ఫీట్ ని కదిలించగల సత్తా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కి వుంటుంది. సాధారణంగా ఐటెం సాంగ్స్ ని అంతగా ఆదరించని మహిళా ప్రేక్షకులు సైతం దేవి మాస్ సాంగ్స్ కి పిచ్చ ఫ్యాన్స్..

ఇంత భీభత్సమైన బ్యాక్ డ్రాప్ లో దేవి - చిరుల కాంబినేషన్ లో వచ్చిన హిట్ ఆల్బమ్స్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఖైదీ నెంబర్ 150పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వీరి కాంబినేషన్ నుండి అద్భుతాన్ని ఆశిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఆశించినదానికి వ్యతిరేకంగా దేవి బీట్స్ పై కాపీ ముద్ర పడడం షాకింగ్ అంశమే.

టీజర్ రిలీజ్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇటీవల హిందీ సూపర్ హిట్ సినిమా సుల్తాన్ నుండి లిఫ్ట్ చేశాడని వీడియో ప్రూఫ్లతో సైతం ఋజువుచేశారు. ఇప్పుడు మాస్ సాంగ్ కాదు బాస్ సాంగ్ అంటూ రిలీజ్ చేసిన అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాట తానే స్వరపరిచిన 'పక్కా లోకల్' సాంగ్ ని పోలివుండడంతో సోషల్ మీడియాలో దుమారం లేస్తుంది. దేవికి ఇవన్నీ రీచ్ అవుతున్నాయో లేదో..

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/