Begin typing your search above and press return to search.

'మిస్టర్‌ మజ్ను' కాపీనా?

By:  Tupaki Desk   |   26 Sep 2018 6:18 AM GMT
మిస్టర్‌ మజ్ను కాపీనా?
X
అఖిల్‌ అక్కినేని హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రంపై అక్కినేని అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌ ప్లే బాయ్‌ గా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన టీజర్‌ ద్వారా తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు - నాగార్జునలు రొమాంటిక్‌ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. వారి దారిలోనే అఖిల్‌ ఈ చిత్రంతో రొమాంటిక్‌ హీరోగా పేరు తెచ్చుకుంటాడనిపిస్తుంది. వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై కాపీ విమర్శలు వస్తున్నాయి.

బాలీవుడ్‌ లో రణబీర్‌ కపూర్‌ హీరోగా వచ్చిన బచ్నా ఏ హసీనో అనే చిత్రానికి ఇది కాపీ అంటూ టాక్‌ వినిపిస్తుంది. లవ్‌ రొమాంటిక్‌ సినిమాలు అన్ని కూడా దాదాపు ఒకే విధంగా, ఒకే ప్లాట్‌ తో ఉంటాయి, కనుక ‘బచ్నా ఏ హసీనో’ చిత్రానికి ‘మిస్టర్‌ మజ్ను’ కాపీ అంటూ ఇప్పుడే చెప్పలేం. సినిమా విడుదలయితే కాని అసలు విషయం క్లారిటీ రాదు. కాని సోషల్‌ మీడియాలో మాత్రం ఆ బాలీవుడ్‌ సినిమాకు మిస్టర్‌ మజ్ను ప్రీక్వెల్‌ అని ఇన్సిపిరేషన్‌ గా తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న కాపీ ప్రచారం పక్కన పెడితే ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. అఖిల్‌ కు ఈ చిత్రం చాలా కీలకం అని చెప్పుకోవాలి. మొదటి రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాయి. అందుకే ఈ చిత్రంతో అయినా అఖిల్‌ తన సత్తాను చాటాల్సి ఉంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నట్లుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌ లో టాక్‌ వినిపిస్తుంది.