Begin typing your search above and press return to search.

పోస్టర్ కూడా కాపీ కొడతారా దాసూ!

By:  Tupaki Desk   |   13 April 2019 8:32 AM GMT
పోస్టర్ కూడా కాపీ కొడతారా దాసూ!
X
మన దర్శకులు కొందరు పైకి మహా తెలివైన వాళ్ళ లాగా స్వంత తెలివి తేటలు ఉన్నవాళ్ళలాగా కనిపిస్తారు కానీ లోలోపల మాత్రం అన్ని ఇంగ్లీష్ కొరియన్ సినిమాల డివిడిలే తిరుగుతూ ఉంటాయి. సరే కథలోని లైన్ నో లేదా సమూలంగా ప్లాట్ నో ఎత్తేస్తే సమస్య లేదు. అలా కాకుండా అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూసే పోస్టర్లను కూడా కాపీ కొడితే ఇక దాన్నేమనాలి.

మన దగ్గర డిజైనర్లు లేకనా పోనీ క్రియేటివిటీ లేదా అంటే అన్ని ఉన్నాయి. ఊరికే కాంబోను అనౌన్స్ చేస్తే చాలు ఫ్యాన్ మేడ్ పోస్టర్ అంటూ అభిమానులే తమ హీరోల కోసం అద్భుతమైన లుక్స్ తయారు చేస్తున్నారు. అలాంటిది ఒరిజినల్ నిర్మాతలు ఎలా ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా. అక్కడికే వద్దాం

ఇటీవలే పూజా కార్యక్రమాలతో రజనీకాంత్ మురుగదాస్ కాంబోలో కొత్త సినిమా దర్బార్ మొదలైన సంగతి తెలిసిందే. నయనతార హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. నివేదా థామస్ ఓ కీలక పాత్ర చేస్తోందనే టాక్ ఉంది కాని అది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ సందర్భంగానే దర్బార్ టీం ఫస్ట్ లుక్ పోస్టర్ పేరుతో ఓ లుక్ ని రిలీజ్ చేసింది.

అది అచ్చంగా అప్పుడెప్పుడో వచ్చిన కిల్లింగ్ గంతర్ అనే హాలీవుడ్ మూవీ పోస్టర్ ని కాపీ చేసినట్టుగా ఉండటంతో అందరూ షాక్ తిన్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో రచ్చ షురు అయిపోయింది. అయినా చేతిలో టైం వనరులు ఉన్నప్పుడు కొత్తగా ఏదైనా చేయాలి కాని ఇలా కాపీ కొట్టడం ఏంటి దాసూ అని నెటిజెన్లు అప్పుడే కామెంట్లు విసురుతున్నారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ట్రెండ్ లో జాగ్రత్తగా ఉండకపోతే ఎలా. ఇంతకీ కాపీ వ్యవహారం పోస్టర్ వరకేనా లేక కథ కూడానా అనే అనుమానాలు కూడా మొదలైపోయాయి