Begin typing your search above and press return to search.

శేష్.. ఏంటీ కాపీ క్యాట్ గోల‌?

By:  Tupaki Desk   |   9 Jun 2019 5:44 AM GMT
శేష్.. ఏంటీ కాపీ క్యాట్ గోల‌?
X
త‌క్కువ బ‌డ్జెట్‌తో అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో సినిమా తీసి సక్సెస్ సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు `గూఢ‌చారి` మేక‌ర్స్. `గూఢ‌చారి` రైట‌ర్ కం హీరోగా శేష్ కి మెజారిటీ క్రెడిట్ ద‌క్కింది. బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యంతో పాటు అడివి శేష్ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఈ చిత్రానికి శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. స్పై థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కి బాక్సాఫీస్ వ‌ద్ద‌ లాభాల్ని తెచ్చిపెట్టడ‌మే కాకుండా టీమ్ కి గొప్ప పేరు తెచ్చింది. ప్ర‌స్తుతం శేష్ `ఎవ‌రు` అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ మూవీ టైటిల్ ని ప్ర‌క‌టించారు. `గూఢ‌చారి` విజ‌యంతో రెట్టించిన ఆనందంలో వున్న అడివి శేష్ సైలెంట్‌ గా పీవీపీ బ్యాన‌ర్‌ లో ఈ థ్రిల్లర్ చిత్రాన్ని చేస్తున్నారు. వెంక‌ట్ రాంజీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. చిత్రీక‌రణ సైలెంట్‌గా పూర్తయింద‌ని తెలుస్తోంది. ఎప్పుడు మొద‌లుపెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో కూడా తెలియ‌కుండా స‌డెన్ గా టైటిల్ ని ప్ర‌క‌టించి బిగ్ షాక్ ని ఇచ్చారు. ఇక ఈ సినిమాలో రెజీనా కాసండ్రా క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

తాజాగా ఈ సినిమా క‌థాంశం కాపీ క్యాట్ క‌థాంశం అంటూ ఫిలింన‌గ‌ర్ లో ప్ర‌చారం సాగుతోంది. స్పానిష్ చిత్రం `ది ఇన్విజిబుల్ గెస్ట్‌`కి ఫ్రీమేక్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార‌న్న మాటా వినిపిస్తోంది. ఈ సినిమాపై వ‌స్తున్న రూమ‌ర్స్‌ పై అడివి శేష్ ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌డం లేదు. అయితే ఇది ఫ్రీమేక్ నా? లేక `ఓ బేబీ` త‌ర‌హాలో రీమేక్ రైట్స్ తీసుకుని చేస్తున్నారా అన్న‌ది తెలియాల్సి వుంది. అడివి శేష్ స్వ‌యంగా దీనిపై వివ‌ర‌ణ ఇస్తారేమో చూడాలి.

ఇటీవ‌ల తెలుగు సినిమా కాపీ క్యాట్ వ్య‌వ‌హారాల‌పై తీవ్ర‌ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాజ‌మౌళి- త్రివిక్ర‌మ్- పూరి అంత‌టి వాళ్ల‌కే ఈ తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌లే `లార్గో వించ్` చిత్ర క‌థ‌తో `అజ్ఞాత‌వాసి` తెర‌కెక్కించిన‌ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ విమ‌ర్శ‌ల పాలైన విష‌యం ఇంకా మ‌రువ‌క ముందే మ‌ల్టీ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ పైనా ఆ త‌ర‌హా విమర్శ‌లు రావ‌డంపై అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. మ‌రి దీనిపై శేష్ భ‌య్యా ఫుల్ క్లారిటీనిస్తారేమో చూడాలి.