Begin typing your search above and press return to search.
వీడియో: స‌్టార్ హీరో బాడీ గార్డ్ డ్రగ్స్ ఓవర్ డోస్
By: Tupaki Desk | 28 Sept 2019 1:17 PM ISTవీధుల్లో పడి పాదచారుల్ని కొట్టాడు.. వాహనదారుల్ని పడగొట్టాడు.. ఓ మై గాడ్.. నానా రచ్చ చేశాడు. అతడు ఎవరో తెలుసా.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాజీ సెక్యూరిటీ గార్డ్ ఆనస్ ఖురేషి. అతడి వీరంగం వీడియో నెటిజనుల్లో వైరల్ గా మారింది. అతడు అంత దారుణంగా ప్రవర్తించడానికి కారణమేంటి? అంటే.. శ్రుతి మించి డ్రగ్స్ సేవించడమేనని తెలుస్తోంది.
అతడు కొన్ని స్టెరాయిడ్స్ ని శరీరంలోకి తీసుకుని ముంబై లోని మొరాదాబాద్ ఏరియాకి వెళ్లాడు. అక్కడ నడిరోడ్డున పడి దారిన వస్తున్న వాహనాల్ని ఆపి.. చాలా మందిని కొట్టి నానా రచ్చ చేశాడు. అయితే అతడు పుచ్చుకున్న డ్రగ్ ప్రభావం ఎక్కువై.. ఓవర్ డోస్ వల్ల ఇలా చేశాడని స్థానికులు గుర్తించారు.
అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వారికి ఆ పని అంత సులువుగా అవ్వలేదు. దీంతో పోలీసులు బరిలో దిగి ఆపాలని ట్రై చేశారు. కానీ సల్మాన్ లానే బలాడ్యుడు అయిన అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. దీంతో ఒక పులినో లేక క్రూర మృగాన్నో బంధించినట్టు అతడిపై వల వేసి బంధించారు. అలా బంధిస్తున్న వీడియో ఒకటి అంతర్జాలంలో రిలీజైంది. ఈ వీడియో ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతోంది. భాయ్ మాజీ సెక్యూరిటీ గార్డ్ కావడంతో అది కాస్తా హైలైట్ అయ్యింది.