Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్‌: వైరస్‌ జాగ్రత్తలతో వచ్చిన 'కూలీ నెం.1'

By:  Tupaki Desk   |   12 Jun 2020 6:05 AM GMT
ఫస్ట్‌ లుక్‌: వైరస్‌ జాగ్రత్తలతో వచ్చిన కూలీ నెం.1
X
వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా షూటింగ్స్‌ జరగలేదు. ఎట్టకేలకు ప్రభుత్వాలు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో షూటింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. ఒక వైపు వైరస్‌ బాధితుల సంఖ్య వేలల్లో పెరుగుతున్నా కూడా షూటింగ్స్‌ మాత్రం ఫుల్‌ స్వింగ్‌ లో చేస్తున్నారు. బాలీవుడ్‌ టాలీవుడ్‌ కోలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా కొత్త సినిమాలు ప్రారంభం అవుతున్నాయి. రూల్‌ ప్రకారం మద్యలో ఆగిన సినిమాలనే షూటింగ్‌ చేయాలని సూచించినా కూడా కొత్త సినిమాల షూటింగ్స్‌ కూడా షురూ అయ్యాయి.

బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో వరుణ్‌ ధావన్‌ తన కొత్త సినిమాను ప్రకటించాడు. ‘కూలీ నెం.1’ అనే టైటిల్‌ తో వరుణ్‌ దావన్‌ సినిమా చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశాడు. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ ఫస్ట్‌ లుక్‌ ను తీసుకు వచ్చారు. వరుణ్‌ ధావన్‌ మాస్క్‌ పెట్టుకుని ఉండటంతో పాటు పొలిటికల్‌ క్యాప్‌ ను పెట్టుకుని ఉన్నాడు. దాంతో కాస్త విభిన్నమైన స్పందన ఈ ఫస్ట్‌ లుక్‌ కు వచ్చింది. ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ తో ఈ సినిమా ఉంటుందేమో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

బాలీవుడ్‌ లో గతంలో కూలీ నెం.1 చిత్రం వచ్చింది. టాలీవుడ్‌ లో కూడా వెంకటేష్‌ హీరోగా కూలీ నెం.1 చిత్రం వచ్చింది. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అదే టైటిల్‌ తో వరుణ్‌ ధావన్‌ సినిమా చేయబోతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.