Begin typing your search above and press return to search.

యూ మేక్ మీ.. యూ బ్రేక్ మీ: ఉపాసన

By:  Tupaki Desk   |   22 Nov 2018 1:58 PM GMT
యూ మేక్ మీ.. యూ బ్రేక్ మీ: ఉపాసన
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తరచుగా అభిమానులకోసం ఇంట్రెస్టింగ్ అప్ డేట్లు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఉపాసన ఫుడ్ గురించి ఒక ట్వీట్ చేసింది. 'యూ మేక్ మీ - యూ బ్రేక్ మీ. నువ్వే నాకు బలాన్నిస్తావు & సంతోషాన్నిస్తావు. మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు నీ కంపెనీ కోసం తపిస్తాను. నువ్వు నా సపోర్ట్ సిస్టమ్. నువ్వే నాకు నయం చేస్తావు. ఎప్పుడూ నా పక్కనే ఉన్నందుకు థ్యాంక్ యు. ఐ లవ్ యూ & రెస్పెక్ట్ యు - ఫుడ్."

చివరివరకూ చదవకపోతే రామ్ చరణ్ కోసం పెట్టినదిలాగా అనిపిస్తుందేమో కానీ ఉపాసన 'ఫుడ్' కోసమే మెసేజ్ పెట్టింది. మన పెద్దవాళ్ళు 'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అంటుంటారు. ప్లేట్ లో పెట్టుకున్న అన్నం ఎప్పుడూ పడెయ్యకూడదని కూడా అంటారు. ఉపాసన అలాంటి సందేశమే మరో రూపంలో ఇచ్చింది. దీనికి చాలామంది నెటిజనులు ఉపాసనను మెచ్చుకుంటున్నారు.

చరణ్ తో రీసెంట్ గా అజర్ బైజాన్ కు వెళ్ళినపుడు అక్కడ లోకల్స్ తో కలిసి వంట చేసిందట. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి "అజర్ బైజాన్ లో రామ్ చరణ్ షూటింగ్ తో బిజీగా ఉంటే నేను లోకల్స్ తో కలిసి వంట చేస్తున్నాను. స్ట్రీట్ ఫుడ్.. అందులోని సింప్లిసిటీ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇంట్లో ఇలాంటిదే హెల్దీ వెర్షన్ ఫుడ్ మా ఇంట్లో చేసుకునేందుకు నాకు ఇదో ఇన్ స్పిరేషన్ ఇస్తుంది.. ఈ రెసిపీ ని మీ స్టైల్ స్టఫ్ఫింగ్ తో ట్రై చెయ్యండి.. ఎంజాయ్." ఈ కుకింగ్ వీడియో కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి