Begin typing your search above and press return to search.

జక్కన్నపై నిందలు.. ఆపై అవసరమే అంటూ అల్లూరి భీమ్‌!

By:  Tupaki Desk   |   25 Aug 2021 12:00 PM IST
జక్కన్నపై నిందలు.. ఆపై అవసరమే అంటూ అల్లూరి భీమ్‌!
X
ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదటి రెండు ఎపిసోడ్స్ చాలా సరదాగా సాగాయి. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ల మద్య సాగిన సంభాషణలు అందరిని ఎంటర్‌ టైన్ చేశాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా వారి మద్య గేమ్ సాగింది. ఆ సమయంలోనే వారు చేస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ ముచ్చట్లు కూడా పెట్టుకున్నారు. ఆ సినిమా దర్శకుడు జక్కన్న యొక్క పని డెడికేషన్ ను గురించి వారు చేసిన వ్యాఖ్యలు ఒకింత సినిమాపై ఆసక్తిని పెంచాయి అనడంలో సందేహం లేదు. రాజమౌళితో సినిమా అంటే అంత సులభం కాదు అంటూ మరోసారి వీరి మాటలతో క్లారిటీ వచ్చింది. అయితే కష్టపడ్డా కూడా ఫలితం ఉంటుందని మాత్రం వారు గట్టిగా చెప్పకనే చెప్పారు.

రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు జక్కన్నను పని రాక్షసుడు అంటూ కితాబిచ్చారు. అది కాస్త తిట్టినట్లుగా ఉన్నా.. ఆయన చిన్న విషయానికి కూడా విసిగిస్తాడు అంటూ నిందలు వేశారు. గడ్డం పెరిగింది ఏంటీ.. డ్రస్‌ నుండి మొదలుకుని ప్రతి విషయంలో కూడా చాలా క్లారిటీ అవసరం అంటూ జక్కన్నపై సున్నితంగా విమర్శలు చేశారు. అయితే ఆర్ ఆర్‌ ఆర్‌ వంటి అద్బుతం ఆవిష్కారం అవ్వాలంటే అలాగే ఉండాలంటూ ఇద్దరు హీరోలు కూడా మళ్లీ ఆయన్ను ఆకాశమే హద్దు అన్నట్లుగా పైకి ఎత్తారు. రాజమౌళి వంటి అద్బుత దర్శకుతో వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టం అంటూ ఇద్దరు కూడా రాజమౌళికి కృతజ్ఞతలు చెప్పారు.

అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్‌ నటిస్తుండగా.. కొమురం భీమ్ పాత్రను ఎన్టీఆర్‌ పోషిస్తున్నాడు. అద్బుతమైన సినిమాలను రాజమౌళి ఇప్పటికే అందించాడు. అంతుకు మించిన అద్బుతం అన్నట్లుగా ఈ సినిమా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు అంటున్నారు. సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ఒక అద్బుతం అన్నట్లుగా ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అక్టోబర్‌ లో ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా వచ్చే ఏడాది సమ్మర్‌ కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్‌.