Begin typing your search above and press return to search.
'సీత'గా కరీనా బదులుగా కాంట్రవర్సీ క్వీన్..?
By: Tupaki Desk | 22 Jun 2021 6:00 AM ISTకొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో మూవీస్ పరంగా ఎన్నో మార్పులు జరిగాయి. ఇదివరకు పురాణాలు.. ఇతిహాసాలను తెరకెక్కించాలంటే రిస్క్ లా భావించేవారు మేకర్స్. కానీ ఇప్పుడు అందరూ పురాణాలు ఇతిహాసాలను బేస్ చేసుకొని సినిమాలు తెరకెక్కించే పనిలో పడుతున్నారు. అలాగే భాషలతో సంబంధం లేకుండా సౌత్ టు బాలీవుడ్ వరకు చాలా ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. టాలీవుడ్ నుండి పాన్ ఇండియా వైడ్ సినీరచయితగా పాపులర్ అయ్యారు కే. విజయేంద్రప్రసాద్. సాధారణంగా అందరికి దర్శకధీరుడు రాజమౌళి తండ్రిగా సుపరిచితులు. అయితే ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాలకు కథలు ఆయనే అందించారు.
అలాగే అప్పుడప్పుడు వేరే సినిమాలకు కూడా కథలు - స్క్రీన్ ప్లే రాస్తుంటారు. కానీ మొత్తానికి విజయేంద్రప్రసాద్ ఎల్లప్పుడూ చేతినిండా రైటింగ్ పనితో బిజీగా ఉంటారని అర్ధమవుతుంది. అయితే ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రధానపాత్రలో విజయేంద్రప్రసాద్ రామాయణం ఆధారంగా సీత అనే కథను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆల్రెడీ కరీనా కపూర్ తో సీత క్యారెక్టర్ కోసం మేకర్స్ చర్చలు కూడా జరిపారు. ఆమె కూడా ఈ సినిమా చేసేందుకు సానుకూలంగానే స్పందించినట్లు టాక్ వచ్చింది. రామాయణ ఇతిహాసంలో రాముడి భార్య అయిన సీత కోణంలో ఈ సినిమాను ప్లాన్ చేశారు.
అదిగాక కరీనా సీత క్యారెక్టర్ చేసేందుకు కండిషన్లు కూడా పెట్టిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆమె డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. సాధారణంగా కరీనా కపూర్ ప్రతి సినిమాకు ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. కానీ సీత సినిమా చేయడం కోసం వీలైనన్ని ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి వస్తుందని.. అందుకే ఆమె దాదాపు డబుల్ ఛార్జ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సినిమాకు అలౌకిక దేశాయ్ దర్శకత్వం వహించనున్నాడు.
అయితే తాజాగా ఈ సినిమాలో కరీనా క్యారెక్టర్ పై సోషల్ మీడియాలో పలు పుకార్లు వినిపిస్తున్నాయి. కరీనా బదులుగా సీత క్యారెక్టర్ లో కంగనాను తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కరీనా సినిమాలు చేయక చాలారోజులు అయింది. అలాగే సౌత్ ప్రేక్షకులకు కరీనా అంతగా పరిచయం కాలేదు. కానీ కంగనా మాత్రం మణికర్ణికతో పాటు త్వరలో తలైవి సినిమాతో క్రేజ్ తెచ్చుకోబోతుంది. సో కంగనాను సెలెక్ట్ చేసుకుంటే సినిమాకు సౌత్ నార్త్ లో అనుకున్న బిజినెస్ జరుగుతుందని టాక్ నడుస్తుంది. అదిగాక కరీనా నుండి ఇంతవరకు క్లారిటీ రాలేదని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. చూడాలి మరి త్వరలోనే సినిమా పై క్లారిటీ రానుందేమో!