Begin typing your search above and press return to search.

ఉపాస‌న చుట్టూ వివాదం..నెట్టింట ట్రోల్ చేస్తున్ననెటిజ‌న్స్

By:  Tupaki Desk   |   27 Jan 2022 8:35 AM GMT
ఉపాస‌న చుట్టూ వివాదం..నెట్టింట ట్రోల్ చేస్తున్ననెటిజ‌న్స్
X
సోష‌ల్ మీడియా ప్ర‌భావం వ‌ల్ల సామాన్యుల ద‌గ్గ‌రి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఏ విష‌యంపై స్పందించాల‌న్నా ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించాల్సిన ప‌రిస్థితి. ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌కుండా నెట్టింట తోచింది ట్వీట్ చేశారో అడ్డంగా బుక్కైపోవాల్సిందే. ఇలా త‌మ‌కు న‌చ్చింది ట్వీట్ చేసి నెటిజ‌న్ ల‌కు అడ్డంగా బుక్క‌వుతున్న సెల‌బ్రిటీలు చాలా మందే వున్నారు. ఇప్పుడు వారి జాబితాలో మెగా కోడ‌లు, స్టార్ హీరో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వైఫ్ ఉపాస‌న చేరారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా నిత్యం యాక్టీవ్ గా వుంటూ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ల‌తో ఆక‌ట్టుకుంటున్న ఉపాస‌న తాజాగా ఓ వివాదంలో చిక్కుకుని నెటిజ‌న్ ల ట్రోలింగ్ కి గురికావ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.

సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ త‌న కంటూ ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్న ఉపాస‌న తాజాగా సోస‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన పోస్ట్ ఇప్పుడు ఆమెని వివాదంలో ప‌డేసింది. జ‌న‌వ‌రి 26న భార‌త గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఉపాస‌న చేసిన ట్వీట్ ఇప్పుడు ఆమె చుట్టూ వివాదంగా మారింది. భార‌త గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఉపాస‌న ఓ ట్వీట్ చేసింది. అందులో ఓ గుడి గోపురంపై ఉన్న విగ్ర‌హాల మ‌ధ్య‌ కొంత మంది సామాన్యుల ఫొటోల‌ని ఫొటోషాప్ లో క్రియేట్ చేశారు. అలా వున్న ఫొటోల్లో త‌ను, త‌న భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ కూడా వున్నార‌ని వెల్ల‌డించింది ఉపాస‌న‌.

ఇదే ఇప్పుడు ఆమెని వివాదంలోకి తీసుకొచ్చింది. ఉపాస‌న చేసిన ట్వీట్ పై నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు. ఇలా గుడి గోపురంపై ప్ర‌చారం చేసుకోవ‌డం ఏమీ బాగాలేద‌ని ఆమెని ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎంద గొప్ప వారైతే మాత్రం దేవుడి గోపురాన్ని ఇలా అడ్డం పెట్టుకుని ప్ర‌చారం చేసుకుంటారా? అని నిల‌దీస్తున్నారు. మీరు రీక్రియేట్ చేయించిన ఈ పోస్ట‌ర్ హిందువుల మ‌నోభావాల్ని దెబ్బ‌తీసేదిలా వుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. అంతే కాకుండా ఈ ఫోటోని క్రియేట్ చేసిన క‌ళాకారుడిని అభినందించ‌డం మాని వేల ఏళ్ల క్రితం ఆ గుడిని నిర్మానానికి ప‌ని చేసిన క‌ళాకారుల్నిగుర్తుచేసుకుంటే మంచిద‌ని మ‌రి కొంత మంది విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అంతే కాకుండా గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మీరు ఇచ్చిన సందేశం ఏంట‌ని?..ఇలాంటి ఫొటోల్ని షేర్ చేసి బార‌తీయుల మ‌నోభావాల్ని కించ‌ప‌రుస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఇక ఉపాస‌న చేసిన ఆ పోస్ట్ ని వెంట‌నే డిలీట్ చేసి త‌ప్పుని స‌రిదిద్దుకోమ‌ని కూడా కొంత మంది నెటిజ‌న్ లు హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఉపాస‌న మాత్రం ఈ ట్రోలింగ్ పై ఎలాంటి రిప్లై ఇవ్వ‌క‌పోవ‌డం విశేషం.

మీరు ఎంత గొప్పవారైనా దేవుడి గోపురాన్ని ఇలా అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకోవడం తగదని, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని విమర్శించారు. మరో నెటిజన్ ఫోటో తీసిన కళాకారుడిని ప్రశంసించడం కంటే, వేల సంవత్సరాల క్రితం ఆ దేవాలయాన్ని నిర్మించిన కళాకారులను గుర్తుంచుకోండి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చిన సందేశం ఏమిటి? ఈ ఫోటోను షేర్ చేసి భారతీయులను అవమానించడం ఎందుకు? ఆ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేయాలని కూడా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.