Begin typing your search above and press return to search.

వివాదాలు పక్కన పెట్టి ఆలయాల చుట్టూ తిరుగుతున్న కంగనా !

By:  Tupaki Desk   |   19 Feb 2021 2:00 PM IST
వివాదాలు పక్కన పెట్టి ఆలయాల చుట్టూ తిరుగుతున్న కంగనా !
X
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మంచి నటిగా వరుస సినిమాల్లో నటిస్తూనే వివాదాలలో కూడా ఉంటూ ఉంటారు. తరచూ బాలీవుడ్ పెద్దలపై ఆమె చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుంటాయి. ఆ మధ్య మహారాష్ట్ర గవర్నమెంట్ తోనే అమీ తుమీకి దిగింది కంగనా. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై ను పాకిస్థాన్ తో పోల్చిన తర్వాత ఆమె చుట్టూ అన్ని వివాదాలే చుట్టుముట్టాయి. వసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌ నుంచి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె ముంబైలోని తన మణికర్ణిక కార్యాలయ భవనాన్ని పాక్షికంగా నష్టపోవాల్సి వచ్చింది.

ఈ భవనాన్ని అక్రమంగా నిర్మించారనే కారణంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పడగొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమె చివరికి బోంబే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. హైకోర్టు నుంచి ఊరట పొందారు. అప్పటి నుంచీ కంగనా రనౌత్ తరచూ ఏదోరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ తెల్లవారు జామున ఆమె ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ ఆలయాన్ని సందర్శించారు. జగన్నాథుడిని దర్శించారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను దర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముంబై నుంచి విమానంలో భువనేశ్వర్ ‌కు చేరుకున్న అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పూరీకి బయలుదేరి వెళ్లారు. తెల్లవారు జామున జగన్నాథుడి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అధికారులకు కంగనాకు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందించారు.