Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఈ ఫోటోలో తప్పేముంది?

By:  Tupaki Desk   |   15 April 2017 9:34 AM GMT
ఫోటో స్టోరి: ఈ ఫోటోలో తప్పేముంది?
X
వంశీ ''ఫ్యాషన్ డిజైనర్'' సినిమా ప్రీ-లుక్ పోస్టర్ ఒకటి రాగానే.. అలా హీరోయిన్ కొలతలు తీసుకుంటున్న పోస్టర్ చూపించేసి.. చాలా పెద్ద తప్పు చేసి అమ్మాయిలను అవమానించారు అంటూ ఒక కంట్రోవర్శీ చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఫోటో తాలూకు ఫుల్ సైజ్ ఒరిజినల్ బయటకు వదిలారు మేకర్స్.

నిజానికి ఈ ఫోటోలో సుమంత్ అశ్విన్ ఛలాకీగా కొలతలు తీసుకుంటుంటే.. అనీషా ఆంబ్రోస్ మాత్రం సెక్సీగా షార్ట్స్ లో తన ఒంపులను వయ్యారంగా వడ్డించేస్తోంది. ఈ ఫోటోలో యాక్చువల్ గా అంత బూతేమీ లేదనే చెప్పాలి. నిజానికి యూసఫ్ గూడ గణపతి కాంప్లెక్స్ దగ్గరున్న డిజైనర్ టైలరింగ్ షాపులు ఎక్కడికి వెళ్లినా కూడా.. ఇదే విధంగా చాలామంది కుర్రాళ్ళు అమ్మాయిల కొలతలు తీసుకుంటుంటారు. ఛాతి నుండి నడుం వరకు వారు కొలతలు తీసుకుని నోట్ చేసుకుని.. అమ్మాయిలు చెప్పినంత డీప్ లో.. స్టయిలిష్‌ గా బ్లౌజులూ డ్రస్సు టాపులూ కుడుతుంటారు. నిజ జీవితంలో జరిగే ఒక సీన్ చూపిస్తే.. అందులో తప్పుందంటారేటి సామి అంటూ ఆడియన్స్ చెవులు కొరికేసుకుంటోంది అందుకే.

ఏదేమైనా కూడా అప్పట్లో జమజచ్చతో అలరించిన వంశీ.. ఇప్పుడు అనీషా అందాలతో ఊరించేస్తున్నాడు. చూద్దాం సినిమాలో ఇంకెన్ని ఫీట్లు చేయిస్తాడో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/