Begin typing your search above and press return to search.

పదేళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్దమయిన వివాదాస్పద హీరోయిన్‌

By:  Tupaki Desk   |   10 Nov 2020 12:40 PM IST
పదేళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్దమయిన వివాదాస్పద హీరోయిన్‌
X
ఇండియాలో మీటూ ఉద్యమం మొదలు అవ్వడానికి కారణం సీనియర్‌ హీరోయిన్‌ తనూశ్రీ దత్తా అనే విషయం అందరికి తెల్సిందే. ఆమె సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ పై చేసిన మీటూ ఆరోపణలతో వేడి మొదలు అయ్యింది. పదేళ్ల క్రితం ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ తనూశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇన్నాళ్ల తర్వాత కూడా మీటూ ఆరోపణలు చేయవచ్చు అనే విషయం ఆమె ద్వారా వెలుగులోకి రావడంతో చాలా మంది సోషల్‌ మీడియా ద్వారా గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వేదింపులను చెప్పుకొచ్చారు.

సినిమాల్లో గత పదేళ్లుగా నటించకున్నా గత రెండేళ్లుగా మీడియా ద్వారా విపరీతమైన పబ్లిసిటీని దక్కించుకున్న తనూశ్రీ దత్తా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. అమెరికా డిఫెన్స్‌ లో ప్రతిష్టాత్మక ఉద్యోగం లభించినా కూడా ఆమె మాత్రం ఆ అవకాశంను వదిలేసి సినిమాలు చేయాలని భావించిందట. ఆ విషయమై తాజాగా మాట్లాడుతూ మూడు సంవత్సరాల పాటు అమెరికా డిపెన్స్‌ లో ఉద్యోగంకు కాంట్రాక్ట్‌ అడిగారు. అందుకే నేను ఆ ఉద్యోగం చేయాలనుకోలేదు.

ముంబయి తిరిగి వచ్చి సినిమాల్లో ఆఫర్స్‌ కోసం ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికే సౌత్‌ నుండి మూడు ఆఫర్లు వచ్చాయి. వాటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని సినిమాలకు కమిట్‌ అవుతాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలోనే నేను నటించాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. త్వరలోనే షూటింగ్స్‌ ప్రారంభం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ వివాదాస్పద హీరోయిన్‌ సౌత్‌ లో మూడు సినిమాలు అంటూ ప్రకటించడంతో తెలుగులో ఏమైనా చేస్తుందా అంటూ టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈమెను వెండి తెరపై చూసే అవకాశాలు ఉన్నయేమో చూడాలి.