Begin typing your search above and press return to search.

జక్కన్న నోరు విప్పేనా.. సినిమాతోనే సమాధానం చెప్పేనా

By:  Tupaki Desk   |   2 Nov 2020 2:20 PM IST
జక్కన్న నోరు విప్పేనా.. సినిమాతోనే సమాధానం చెప్పేనా
X
రాజమౌళి ఒక చిన్న సీన్‌ తీయాలంటే ఎన్నో విధాలుగా ఆలోచించి ప్రతి షాట్‌ కూడా పర్ఫెక్ట్‌ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆయన ప్రతి సీన్‌ కు అభిమానులు.. ప్రేక్షకులు వైపు నుండి ఆలోచించి మరీ తీస్తాడు. అలాంటిది ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమురం భీమ్‌ అయిన ఎన్టీఆర్‌ ను ముస్లీం వేశంలో చూపించాడు.

ఎవరి చేతిలో అయితే ఆయన చంపబడ్డాడో వారి వేషదారణలో కొమురం భీమ్‌ పాత్రను చూసిన ప్రేక్షకులు తట్టుకోలేక పోతున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్‌ కాదు అంటూ ఆయన కుటుంబీకులు మరియు ఆయన వర్గంకు చెందిన వారితో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రాజమౌళిని విమర్శించాడు.

రాజమౌళి ఒక సీన్‌ చేశాడు అంటే అది ఖచ్చితంగా ఏ ఒక్కరి మనో భావాలను దెబ్బ తీయడం కాని.. సినిమాకు అనవరసరమైనది కాని ఉండదు. సినిమా మొత్తం చూస్తే ఖచ్చితంగా ఎన్టీఆర్‌ పాత్ర ముస్లీం వేషదారణలో ఉండటంను ప్రేక్షకులు ఒప్పుకుంటారు అనేది ఆయన నమ్మకం. ఆ విషయంలో ఇప్పుడు రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించాల్సిందే అంటూ అంతా కూడా డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ సమయంలో రాజమౌళి తాను ఎందుకు కొమురం భీమ్‌ అయిన ఎన్టీఆర్‌ తో ఆ వేశం వేయించానో చెప్తాడా లేదంటే సినిమా విడుదల వరకు ప్రేక్షకులను మరియు ఎవరైతే తనను విమర్శిస్తున్నారో వారిని వెయిటింగ్ లో ఉంచుతాడో చూడాలి. సినిమా విడుదల తర్వాత ఎలాగూ ప్రేక్షకులతో పాటు ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారు కన్విన్స్ అవుతారు అనేది యూనిట్‌ సభ్యుల నమ్మకం.