Begin typing your search above and press return to search.

ఏప్రిల్ ధ‌మాకా ట్రీట్ ఆ ఐదు వేటిక‌వే ప్ర‌త్యేకం..!

By:  Tupaki Desk   |   31 March 2021 9:00 AM IST
ఏప్రిల్ ధ‌మాకా ట్రీట్ ఆ ఐదు వేటిక‌వే ప్ర‌త్యేకం..!
X
మ‌హ‌మ్మారీ భ‌యాల‌తో ప‌ని లేకుండా ఈ ఏప్రిల్ ‌లో ప‌లు క్రేజీ చిత్రాలు థియేట‌ర్ల‌లోకి విడుద‌ల‌వుతున్నాయి. ఇందులో తొలిగా కింగ్ నాగార్జున న‌టించిన వైల్డ్ డాగ్ రిలీజ్ కి వ‌స్తోంది. ఈ సినిమా తెలుగు సినిమా స్క్రీన్ పై మునుపెన్న‌డూ లేనంత కొత్త‌గా ఉంటుంద‌ని కింగ్ నాగార్జున బృందం చెబుతోంది. గోకుల్ చాట్ లుంబినీ పార్క్ (హైద‌రాబాద్) పేలుళ్ల నేప‌థ్యం... ఎన్.ఐ.ఏ ఇంటెలిజెన్స్ ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న ల్ మెటీరియ‌ల్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. వైల్డ్ డాగ్ పై అంచ‌నాలు పెరిగాయి.

ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ రిలీజ‌వుతోంది. తెలుగు ఆడియెన్ కి ఎంతో వైవిధ్య‌మైన అనుభవాన్నిచ్చే చిత్రమిది. స్త్రీల సెన్సిటివ్ అంశాల్ని ట‌చ్ చేస్తూ.. కోర్ట్ డ్రామా నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంది. స్క్రీన్ ప్లే బేస్ట్ సినిమా ఇది. ఇందులోనూ పాట‌లు ఫైట్స్ తో ప‌వ‌న్ అల‌రించ‌నున్నార‌‌న్న‌ది అభిమానుల్లో ఉత్సాహం పెంచుతోంది. అలాగే ప‌వ‌న్ కోసం మూడేళ్లుగా వేచి చూస్తుండ‌డంతో ఆ క్రేజుతో బాక్సాఫీస్ రికార్డుల్ని నెల‌కొల్ప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

`వ‌కీల్ సాబ్` త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన ల‌వ్ స్టోరి రిలీజ‌వుతుంది. తెలంగాణ సంస్కృతి భాష యాస నేప‌థ్యంలో ఫీల్ గుడ్ ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ఫిదా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమాగా బోలెడంత క్రేజు నెల‌కొంది. నాగ‌చైత‌న్య‌- సాయిప‌ల్ల‌వి ఈ చిత్రంలో జంట‌గా న‌టించారు. ఇక సారంగ‌ద‌రియా పాటతో ఒక్క‌సారిగా ల‌వ్ స్టోరీపై అంచ‌నాలు స్కైని ట‌చ్ చేశాయి. సాయిప‌ల్ల‌వి ఎన‌ర్జిటిక్ డ్యాన్సులు న‌ట‌న‌.. క‌మ్ముల మార్క్ సెన్సిబిలిటీస్ జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తాయ‌ని అంచనా వేస్తున్నారు.

నాని నటించిన `టక్ జగదీష్` ఏప్రిల్ ‌లో వ‌స్తున్న పూర్తి క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ సినిమా. నేచుర‌ల్ స్టార్ పెర్ఫామెన్స్ .. శివ నిర్వాణ టేకింగ్ మేకింగ్ ఈ సినిమాకి ప్ల‌స్ కానున్నాయ‌ని అంచ‌నా.

ఏప్రిల్ చివరి వారంలో రానా న‌టించిన `విరాఠ‌పర్వం` రిలీజ్ కానుంది. న‌క్స‌లిజం నేప‌థ్యంలో ఎమోషనల్ డ్రామాతో వ‌స్తున్న చిత్ర‌మిది. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. విరాఠ ప‌ర్వం స్థానంలో వెంకీ నార‌ప్ప‌ను రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం ఉంది. నార‌ప్ప కూడా కంటెంట్ బేస్డ్ సినిమా. క‌మ‌ర్షియ‌ల్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. ఈ సీజ‌న్ లో రొటీన్ కి భిన్నంగా కంటెంట్ ఆధారిత సినిమాలు రిలీజ‌వుతున్నాయి. ఇవ‌న్నీ జ‌నాల‌కు కావాల్సినంత కొత్త‌ద‌నాన్ని ప‌రిచయం చేస్తూ.. వినోదాన్ని పంచే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నా వేస్తున్నారు.