Begin typing your search above and press return to search.
రంగీలా బ్యూటీ పొలిటికల్ ఎంట్రీ
By: Tupaki Desk | 26 March 2019 11:07 AM ISTసార్వత్రిక ఎన్నికల వేళ పాత హీరోయిన్లు పొలిటికల్ బాట పడుతున్నారు. కర్ణాటకలో ఇప్పటికే సుమలత నామినేషన్ వేసేయగా.. , తమిళనాడులో హీరోయిన్లు, దేశవ్యాప్తంగా ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా ఒకప్పుడు కుర్రకారు మనసు దోచేసిన రంగీలా భామ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుందట..
ఉర్మిళా మటోండ్కర్ రంగీలా భామగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. 20 ఏళ్ల క్రితం రాంగోపాల్ వర్మ తీసిన రంగీలా సినిమాలో ఈమె అందచందాలకు యువత ఫిదా అయ్యి వెండితెర ఇలవేల్పుగా మార్చేశారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైన ఈమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ముంబై లోక్ సభ స్థానం నుంచి పోటీచేయడానికి రెడీ అయినట్లు తెలిసింది. ఉత్తర ముంబై లోక్ సభ సీటు నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపంతోపాటు ఉర్మిళా కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయం పై స్పందించడం లేదు. చర్చలు జరిగిన మాట వాస్తవమే అయినా అధికారికంగా మాత్రం ఇంకా ఉర్మిళా పోటీపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేదని సమచారం.
ముంబై ఉత్తరం బీజేపీకి కంచుకోటగా ఉంటోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా గోపాల్ శెట్టి బీజేపీ నుంచి ఉన్నారు. గతంలో నటుడు సునీల్ దత్ ఈ నియోజకవర్గం నుంచి 5సార్లు ఎంపీగా గెలిచారు. పాపులర్ సినిమా నటులను నియోజకవర్గం ఆదరిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకుంది. మరి ఉర్మిళా ఇక్కడ గెలుస్తుందో లేదో చూడాలి మరి..