Begin typing your search above and press return to search.
అల్లు శిరీష్ కి అల్లు అర్జున్ అభినందనలు.. ఎందుకంటే..!
By: Tupaki Desk | 15 April 2021 11:00 PM ISTఅల్లు శిరీష్ రీసెంటుగా 'విలాయతి శరాబ్' అనే ఓ హిందీ మ్యూజిక్ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో నటి హీలీ దారూవాలాతో కలిసి ఆటో డ్రైవర్ గెటప్ లో శిరీష్ స్టెప్పులేశాడు. అయితే శిరీష్ చేసిన తొలి మ్యూజిక్ వీడియో రికార్డులు క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొద్ది రోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఓ హిందీ ప్రైవేట్ ఆల్బమ్ చేసిన ఫస్ట్ సౌత్ హీరోగా అల్లు శిరీష్ ఘనత దక్కించుకున్నాడు. అయితే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడు శిరీష్ చేసిన ఫస్ట్ హిందీ సాంగ్ సక్సెస్ అయినందుకు సోషల్ మీడియా ద్వారా అభినందించాడు.
''మీ పాట 100 మిలియన్ వ్యూస్ సాధించినందుకు బిగ్ కంగ్రాచ్యులేషన్స్ శిరీష్. చాలా గర్వంగా ఉంది. ఈ పాటకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు'' అని బన్నీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపాడు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ సైతం తన ఆనందాన్ని పంచుకున్నాడు. ''విలాయటి షరాబ్ పాటపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపించినందుకు మ్యూజిక్ లవర్స్ కి పెద్ద థ్యాంక్స్. 100 మిలియన్స్ వ్యూస్ సాధించి ఛార్ట్ లో టాప్ లో నిలవడం ఊహించలేకపోతున్నాను. టీమ్ అందరికి నా అభినందనలు'' అని పేర్కొన్నాడు.
కాగా, 'విలాయటి షరాబ్' పాటకు ఆదిల్ షేక్ కొరియోగ్రఫీ చేయడంతో పాటు డైరెక్షన్ చేశాడు. లిజో జార్జ్ - డిజె చేటాస్ కలిసి ట్యూన్ కంపోజ్ చేసిన ఆ సాంగ్ ని దర్శన్ రావల్ - నీతి మోహన్ కలిసి ఆలపించారు. లిరిసిస్ట్ కుమార్ ఈ పాటకు లిరిక్స్ రాయగా.. అనురాగ్ సోలంకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించారు.