Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌30 మళ్లీ ఈ కన్ఫ్యూజన్ ఏంటి బాసూ?

By:  Tupaki Desk   |   17 Oct 2021 8:22 PM IST
ఎన్టీఆర్‌30 మళ్లీ ఈ కన్ఫ్యూజన్ ఏంటి బాసూ?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం అంటూ దాదాపుగా రెండున్నర మూడు ఏళ్లుగా మరే ప్రాజెక్ట్‌ ను కూడా మొదలు పెట్టకుండా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ లో చేసిన మరో హీరో రామ్‌ చరణ్ మాత్రం మద్యలో ఆచార్య సినిమాను చేశాడు. ఇటీవలే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టాడు. గౌతమ్ తిన్ననూరి మరియు ప్రశాంత్ నీల్ ల కాంబోలో సినిమా ఉండబోతున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇలాంటి హడావుడిని రామ్ చరణ్‌ చేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం తన తదుపరి సినిమా విషయంలోనే క్లారిటీ ఇవ్వడం లేదు. ఆర్ ఆర్‌ ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ నటించబోతున్న 30వ సినిమాకు గాను త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తాడు అంటూ మొదట అధికారిక ప్రకటన వచ్చింది. కాని కొన్ని కారణాల వల్ల కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ మరియు కొరటాల శివల కాంబోలో రెండవ సినిమా అదుగో ఇదుగో అంటూ ఆగస్టు నుండి వాయిదా వేస్తూ వస్తున్నారు.

అక్టోబర్‌ లో కూడా ఆ సినిమా పట్టాలు ఎక్కే దాఖలాలు కనిపించడం లేదు. ఎన్టీఆర్ 30 కి సంగీత దర్శకుడు అనిరుధ్ అంటూ ఆమద్య వార్తలు వచ్చాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా అనఫిషియల్‌ గా ఖరారు చేయడం జరిగింది. అభిమానులు అదే ఉద్దేశ్యంతో ఉన్నారు. సినిమా ప్రారంభం అయినా కాకున్నా కూడా సంగీత దర్శకుడు లేదా ఇతర ముఖ్య టెక్నీషియన్ బర్త్ డే అయితే చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా హ్యాండిల్స్ నుండి తప్పకుండా బర్త్‌ డే విషెష్‌ రావాల్సిందే. కొరటాల శివ బర్త్‌ డే సందర్బంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ వారు ఎన్టీఆర్‌ 30 చిత్ర దర్శకుడు కొరటాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేయడం జరిగింది. అదే విధంగా సంగీత దర్శకుడు అనిరుథ్ బర్త్‌ డే సందర్బంగా కూడా ఏదైనా క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ 30 గురించి ఎలాంటి అప్‌ డేట్‌ లేకపోవడం వల్ల అసలు ఈ సినిమా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఆచార్య వల్ల చాలా కాలం పాటు స్ట్రక్‌ అయ్యాడు. అలాగే ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్‌ ఆర్‌ వల్ల చాలా ఆలస్యం అయ్యింది. కనుక ఇద్దరు వెంటనే తమ కాంబో సినిమాను మొదలు పెట్టాలి. కాని ఇప్పటి వరకు చడీ చప్పుడు లేదు. కనుక అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఈ కన్ఫ్యూజన్‌ ఏంటో అర్థం కావడం లేదు అంటూ జుట్టు పీక్కుంటున్నాడు. ఎన్టీఆర్ ఇప్పటికే ఆలస్యం చేశాడు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను విడుదల చేయాలంటే వెంటనే మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ మనసులో ఏముందో తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.