Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కొత్తమూవీ టైటిల్ విషయంలో వీడని కన్ఫ్యూషన్??

By:  Tupaki Desk   |   16 Jan 2021 11:56 AM GMT
ఎన్టీఆర్ కొత్తమూవీ టైటిల్ విషయంలో వీడని కన్ఫ్యూషన్??
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందిన 'అరవింద సమేత' సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండోసారి ఈ కాంబో మరో సినిమా చేయబోతుంది. ఒక డైలాగ్ రైటర్.. మంచి డైలాగ్ డెలివరీ కలిగిన హీరో కలిస్తే ఆ సినిమా కాంబో ఎలా ఉంటుందో త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మొదటి ప్రయత్నంలోనే నిరూపించారు. ఎన్టీఆర్ నుండి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో పాటు త్రివిక్రమ్ నుండి డిఫరెంట్ డైలాగ్స్ నందమూరి ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. ఆ సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల మీదనే దృష్టిపెట్టాడు త్రివిక్రమ్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

అయితే పక్కా పొలిటికల్ మాస్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ విషయంలో 'అ' అనే లెటర్ సెంటిమెంట్ ఫాలో అవుతాడని విదితమే. కానీ ఈసారి టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక 'చౌడప్ప నాయుడు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే చౌడప్ప నాయుడు అనేది ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు అయ్యుంటుంది అని అంతా అనుకుంటున్నారు.

ఇప్పుడు అదే ఫైనల్ చేస్తారని ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇదివరకే అయినను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ ఎప్పుడో ఆఫీసియల్ గా ప్రకటించేసారు మేకర్స్. మరి కొత్తగా ఈ టైటిల్ మార్పు గురించి కన్ఫ్యూషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయినను పోయిరావలే హస్తినకు ఫిక్స్ అని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఆఫీసియల్ స్టేట్మెంట్ వస్తుందేమో..!!