Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ తో ఫిక్సింగ్ తేల‌లేదింకా!

By:  Tupaki Desk   |   16 Dec 2019 5:46 AM GMT
ప‌వ‌న్ తో ఫిక్సింగ్ తేల‌లేదింకా!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రీఎంట్రీ ప్ర‌స్తుతం హాట్ టాపిక్. పింక్ రీమేక్ కోసం బోనీక‌పూర్ - దిల్ రాజు బృందం ప‌వ‌న్ తో సంప్ర‌దింపులు సాగిస్తున్నార‌న్న వార్త‌లు రావ‌డం.. అటుపై అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించ‌డం తెలిసిందే. అయితే ఇంత‌కుముందు శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ట్వీట్ ప్ర‌కారం.. ప్రీప్రొడ‌క్ష‌న్ ప్రారంభ‌మైంద‌ని వార్త అందింది. అయితే ప‌వ‌న్ నుంచి ఇంకా పూర్తి క్లారిటీ రాలేద‌ని... కాల్షీట్లు కేటాయించ‌లేద‌ని సందిగ్ధ‌తను ఈ ట్వీట్ రైజ్ చేసింది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ కి అన్నివిధాలా లైన్ క్లియ‌రైన‌ట్టేనా? అంటే ఆన్స‌ర్ ఇవ్వ‌లేని ప‌రిస్థితి. ఇప్ప‌టివ‌ర‌కూ దిల్ రాజు నోటి నుంచి ప‌వ‌న్ ఫిక్స‌యిన‌ట్టేన‌న్న మాట రాలేదు. ఆయ‌న కాల్షీట్లు లాక్ అయ్యాయ‌న్న క్లారిటీని ఇవ్వ‌లేక‌పోయారు. ఈ ఆదివారం సాయంత్రం `ప్ర‌తిరోజూ పండ‌గే` ప్రీరిలీజ్ వేదిక‌పైనా ఈ సంగ‌తిని చెప్పేందుకు దిల్ రాజు త‌ట‌ప‌టాయించారు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ప్రాజెక్ట్ నా 20 ఏళ్ల క‌ల. అది త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతోంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు త‌ప్ప‌.. ప‌వ‌న్ తో ఫిక్స‌య్యింది! అని మాత్రం క‌న్ఫామ్ గా చెప్ప‌లేదు ఎందుక‌నో. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ సైతం తాను న‌టించే సినిమా సమాచారం గురించి పూర్తిగా క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో అది కాస్తా అభిమానుల‌కు డైల‌మాగా మారింది. అయితే ఇన్ని సందేహాలకు పూర్తి క్లారిటీ రావాలంటే దిల్ రాజు కానీ.. ప‌వ‌న్ కానీ అధికారికంగా మీడియా ముఖంగా క్లారిటీగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.