Begin typing your search above and press return to search.
యువ హీరో - నిర్మాతల మధ్య గొడవలు వచ్చాయా..?
By: Tupaki Desk | 12 May 2021 8:00 AM ISTటాలీవుడ్ యువ కథానాయకుడు ఒకరు ప్రస్తుతం అర డజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గతేడాది ఓ ప్లాప్ అందుకున్న హీరో ఆ తర్వాత మరో సినిమా రిలీజ్ చేయకుండా వీటి మీదనే ఉన్నాడు. ఈ ఆరు సినిమాల్లో హోమ్ బ్యానర్ లో ఓ సినిమా.. అలానే పెద్ద బ్యానర్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అయితే పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో చేస్తున్న సినిమా విషయంలో హీరో టీమ్ ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
కొత్త డైరెక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా విషయంలో ప్రొడ్యూసర్ కు యంగ్ హీరో తరుపున మాట్లాడుతున్న వారికి మధ్య మిస్ కమ్యూనికేషన్ వచ్చిందట. ఈ కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగే వరకు వెళ్లిందని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
ఇకపోతే యువ హీరో సొంత బ్యానర్ లో తీస్తున్న సినిమాకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఫైనాన్సియల్ సపోర్ట్ అడిగేందుకు ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ చైర్మన్ తో హీరో టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.