Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ 2 కు మరో డేట్‌ కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   11 Oct 2020 12:25 PM GMT
కేజీఎఫ్‌ 2 కు మరో డేట్‌ కన్ఫర్మ్‌
X
కన్నడ సెన్షేషనల్‌ మూవీ కేజీఎఫ్ సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేజీఎఫ్‌ 2 కోసం వెయిట్‌ చేస్తున్నాయి. మొదటి సినిమాకు పది రెట్ల యాక్షన్‌ ను కేజీఎఫ్‌ 2 లో చూస్తారని.. కేజీఎఫ్‌ 2 తో పోల్చితే కేజీఎఫ్‌ 1 కేవలం ట్రైలర్‌ మాత్రమే అంటూ కాస్త ఎక్కువగానే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అంచనాలు పెంచేశాడు. రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేసిన కేజీఎఫ్‌ మూవీ మేకర్స్‌ కేజీఎఫ్‌ 2 ను రూపొందిస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈనెల 23వ తారీకున ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉంది. కాని కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆలస్యం అయ్యింది. కనుక సినిమాను కాస్త ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు.

గత నెలలోనే కేజీఎఫ్‌ 2 సినిమా షూటింగ్‌ బెంగళూరులో ప్రారంభం అయ్యింది. త్వరలోనే హైదరాబాద్‌ లో చిత్రీకరణ జరుపబోతున్నారు. దాంతో సినిమా మొత్తం పూర్తి అయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల చివరి వరకు సినిమాను దాదాపుగా పూర్తి చేసి డిసెంబర్‌ లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను జరిపేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. ఈ సినిమా ను వచ్చే ఏడాది జనవరి 14వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీ విషయంలో యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు.

థియేటర్ల ప్రారంభంకు తేదీ వచ్చింది. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి మరియు ఇతరత్ర విషయాలను పరిగణలోకి తీసుకుని డిసెంబర్‌ లో కేజీఎఫ్‌ 2 సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. థియేటర్లు ముందు మాదిరిగా సందడిగా మారితో కేజీఎఫ్‌ ను ఖచ్చితంగా జనవరి 14న విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.